పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై మండిపడ్డారు. పవన్ రోజుకో మాట మాట్లాడుతున్నారని, రాజకీయం అంటే సినిమా స్క్రిప్ట్ కాదన్నారు. రాష్ట్రాన్ని దెబ్బ తీసేందుకు కేంద్రం పవన్, జగన్ తో ఈ విధంగా మాటాడిస్తున్నారని అయన అన్నారు. పవన్, జగన్‌కు మోదీ అంటే భయమని, అందుకే బీజేపీ రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తున్న వారి నిలదీయాయటంలేదని అన్నారు. వీరిలో ఒకరికి కేసుల భయం, మరొకరికి నల్లధనం భయమని ఎద్దేవాచేశారు.

chandrababu naidu counter attack on pawan kalyan

పవన్ జగన్ లు కేంద్రాంని విమర్శిస్తే ప్రధాని మోదీ ఎక్కడ జైల్లో పెడతారో ఏమో అని భయపడుతున్నారని విమర్శించారు. అవినీతికి పాల్పడే వారే కేసులకు భయపడతారని, తనకు ఏ భయం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతిని ప్రపంచంలోని అత్యుత్తమ ఐదు నగరాల్లో ఒకటిగా చేస్తామని తెలిపారు. ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూసేలా రాజధాని నిర్మాణం చేపడతామని, తాను ఏది ఆలోచించినా దేశ భవిష్యత్తు కోసమేనన్నారు.

కేంద్రం ఎన్ని ఆటంకాలు సృష్టించిన వాటికి ఎదురొడ్డి అభివృద్ధిపదంలో వెళుతున్నామని అయన అన్నారు. కులం, మతం, ప్రాంతం పేరు చెప్పి ఓట్లు వేయటం కాదని, అభివృద్ధిని చూసి ఓటు వేయండని ప్రజలకు పిలుపునిచ్చారు. బవిష్యత్తులో ఒంగోలు కూడా పెద్ద నగరంగా రూపాంతరం చెందుతుందన్నారు. ప్రకాశం జిల్లాను అభివృద్ధిలో నంబర్ 1 జిల్లాగా చేసే బాధ్యత తనదేనని చంద్రబాబు చెప్పారు.

chandrababu naidu counter attack on pawan kalyan

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *