బీజేపీ మంత్రులపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

ఏపీ కేబినెట్ నుంచి వైదొలుగుతూ రాజీనామా సమర్పంచిన ఇద్దరు బీజేపీ మంత్రులపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. దేవదాయ ధర్మదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇద్దరూ తమ శాఖల పరంగా సమర్థవంతంగా పనిచేశారని సీఎం చంద్రబాబు అభినందించారు. దేవదాయ ధర్మదాయ శాఖ మంత్రిగా పనిచేసిన మాణిక్యాలరావు..

Chief Minister of Andhra Pradesh, N. Chandrababu Naidu looks on as he attends the session ‘Cities as Engines of Growth’ during the second day of the India Economic Summit in New Delhi on October 7, 2016. / AFP / MONEY SHARMA (Photo credit should read MONEY SHARMA/AFP/Getty Images)

కృష్ణా, గోదావరి పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించారని, దేవాలయాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చి దేవదాయ శాఖ ఆదాయం పెరిగేలా కృషి చేశారని చంద్రబాబు కొనియాడారు. కామినేని శ్రీనివాస్ ఆరోగ్యశాఖలో కీలకమైన మార్పులు తీసుకొచ్చారని చెబుతూ ఒక ముఖ్యమంత్రిగా వారిని అభినందిస్తున్నానని చంద్రబాబు చెప్పారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *