బాబు గారు మీ ఐడియా సూపర్

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. అధికార పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలన్నీ ఏకమయ్యాయి. రాజ‌కీయంలో ఇలా పొత్తు పెట్టుకోవడం అనేది ఒక పార్టీ ఇబ్బందిక‌రమైన ప‌రిస్థితుల్లో ఉన్న‌పుడు అది మ‌రింత‌గా బ‌ల‌ప‌డ‌డానికి ఉపయోగపడే అస్త్రం. రాజకీయాలలో ఎప్పుడో ఒకసారి తప్ప పొత్తు అనేది లేకుండా ఇంత‌వ‌ర‌కూ ఏ పార్టీ నిలిచింది లేదు. అది స్టేట్ అయినా సెంట్రల్ అయినా. అయితే ఈ పొత్తులలో కొన్ని ర‌హ‌స్య పొత్తులుంటాయి, ఇంకొన్ని బ‌హిరంగ పొత్తులుంటాయి.

Bengaluru: JD(S) supremo HD Deve Gowda, Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu, West Bengal Chief Minister Mamata Banerjee, JVM-P chief Babulal Marandi and others at the swearing in ceremony of Karnataka Chief Minister H.D.Kumaraswamy in Bengaluru on May 23, 2018. (Photo: IANS)

అయితే ప్ర‌స్తుతం తెలంగాణాలో కాంగ్రెస్ – టీటీడీపీ సంయుక్తంగా పొత్తు పెట్టుకుని ఎన్నిక‌ల‌కు సిద్ధమవుతున్నాయి. కానీ ఒకపుడు తెలంగాణ‌ను ఏలిన పార్టీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి? అనే సందిగ్ధంలో ఎటు తేల్చుకోలేకపోతుంది టికాంగ్రెస్. దీనికి చంద్ర‌బాబు ఒక బ్ర‌హ్మాండ‌మైన ఐడియా ఇచ్చార‌ట‌. ఆ ఐడియాతో మ‌హాకూట‌మికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న కాంగ్రెస్ తెగ ఆనందప‌డింద‌ట‌. ఇంత‌కీ చంద్ర‌బాబు ఇచ్చిన ఆ ఐడియా ఏంటి అనుకుంటున్నారా.

మనంపాలిటిక్స్‌లో నిల‌వాలంటే.. ఎక్క‌డ బ‌లంగా ఉన్నామో కాదు, ఎక్క‌డ బ‌ల‌హీనంగా ఉన్నామో గుర్తించాలి. అందుకే ముందు పార్టీని నిల‌బెట్టే ల‌క్ష్యంతో కాంగ్రెస్‌తో పొత్తుకు వెళ్లారు చంద్ర‌బాబు. అంటే అధికారం అస‌లు ల‌క్ష్య‌మే కాన‌పుడు అటో ఇటో ప‌ట్టువిడుపు వ‌ల్ల మ‌న‌కే లాభం అని డిసైడ్ అయ్యారు. గతంలో టీడీపీ సాధించిన సీట్ల సంఖ్యకు సమానంగా కేటాయిస్తే చాలని చెప్ప‌డంతో పాటు… పంప‌కానికి కూడా బాబు స‌ల‌హా ఇచ్చారు.

సీట్ల విషయంలో జాతీయంగా మంచి పలుకుబడి ఉన్న‌ తటస్థ సంస్థకు బాధ్యతలు అప్పగించి ఓ స‌ర్వే చేయించాల‌ని చెప్పారు. ఆ సర్వేలో కాంగ్రెసు కంటే టీడీపీకి ఆదరణ ఎక్కువగా ఉన్న సీట్లను త‌మ‌కు కేటాయిస్తే చాల‌నేది చంద్ర‌బాబు ఐడియా. నిజానికి ఇది చాల బాగా నచ్చింది కాంగ్రెస్ వర్గానికి. ఈ స‌ర్వే టీడీపీ అడిగిన 30 నియోజకవర్గాలలో చేస్తారు. వాటిలో బ‌లంగా ఉన్న‌ 15 స్థానాలు టీడీపీకి కేటాయిస్తారు. చంద్రబాబు ఇచ్చిన ఈ ఐడియాతో కాంగ్రెస్ ఫిదా అయిపోయిందంట.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *