మీ ఆటలు నా దగ్గర సాగవు: జగన్, పవన్‌లకు చంద్రబాబు వార్నింగ్

chandrababu naidu counter attack on pawan kalyan

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలని తాను ప్రయత్నిస్తుంటే వైసిపి నేతలు అడ్డుపడుతున్నారని ఏపి సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అందుకోసమే ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని, ప్రతి పనిని నాశనం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. అయితే వారి ఆటలు తన వద్ద సాగవని ప్రతిపక్షాలకు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు తిత్లీ తుఫాను బాధితులతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన వైసిపి నాయకుడు జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లపై మండిపడ్డారు. తిత్లీ తుపాన్ వలన శ్రీకాకుళం వాసులు తీవ్రంగా నష్టపోయారన్నారు. తిత్లీ తుఫాను సంబవించిన సమయంలో జగన్, పవన్ లు పక్క జిల్లాలోనే ఉన్నారని, కానీ బాధితులని పరామర్శించిన పాపాన పోలేదని చంద్రబాబు గుర్తుచేశారు. ఇప్పుడు వైసిపి నీచ రాజకీయాలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని…వాటికి తాను భయపడే రకం కాదని చంద్రబాబు హెచ్చరించారు.

ఇక పవన్ కళ్యాణ్ రోజురోజుకి హద్దు మీరుతున్నారని అన్నారు. ఇక ఉద్దానం బాధితులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు నటించే పవన్ కళ్యాణ్ తిత్లీ బాధితుల గురించి ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఆయన ఈ దీనిపై కేంద్రానికి ఒక్క లేఖ కూడా ఎందుకు రాయలేదని అడిగారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వున్న పార్టీలను ఏకం చేయడానికి తాను ప్రయత్నిస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. బిజెపి అరాచక పాలనను అంతమొందించడానికే కాంగ్రెస్ సహకారం కోరిసట్లు తెలిపారు. ఈ పోరాటం ఇంతటితో ఆగదని చంద్రబాబు స్పష్టం చేశారు.

ఈ రోజు శ్రీకాకుళం పర్యటనలో భాగంగా పలాసలో కిడ్నీ పరిశోధనా సంస్థకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అనంతరం తిత్లీ తుఫాను వల్ల నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం తరపున చంద్రబాబు చెక్కులు అందించారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *