
నదుల అనుసంధానంతో చరిత్ర సృష్టించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేసిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. ప్రకాశం బ్యారేజీకి చుక్కనీరు రాకున్నా పట్టిసీమ ద్వారా నీరు ఇస్తున్నామన్నారు.
/wp-content/uploads/2018/06/polavaram-chandrababu2.jpg” alt=”Related image” />
వైకుంఠపురం బ్యారేజీకి త్వరలోనే టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు. కృష్ణా డెల్టా ఆధునీకరణకు రూ.3920 కోట్లు ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కృష్ణా డెల్టాకు నీటి విడుదలలో జాప్యం లేకుండా త్వరగా విడుదల చేశామన్నారు. పోలవరం నిర్మాణం జాప్యం అవుతుందనే ఉద్దేశంతో పట్టిసీమను నిర్మించామని పేర్కొన్నారు. పంటలకు ఇబ్బందులు రాకుండా కాపాడుకోగలిగామన్నారు.
గోదావరి-పెన్నా అనుసంధానానికి ప్రయత్నం చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. వైకుంఠపురం బ్యారేజీకి త్వరలోనే టెండర్లు పిలుస్తామన్నారు. వైకుంఠపురం బ్యారేజీ వద్ద 10 టీఎంసీల నీటిని స్టోర్ చేస్తామన్నారు. నాగావళి-వంశధార నదులను అనుసంధానిస్తామని, గొలుసుకట్టు చెరువులను తిరిగి నిర్మించి భూగర్భ జలాలు పెంచుతామని పేర్కొన్నారు. నీరు పెరిగితే సంపద పెరుగుతుందన్నారు.