
మా మధ్య చాలా మంచి సమావేశం జరిగింది. ప్రజాస్వామ్యం, వ్యవస్థలు, దేశ భవిష్యత్తును కాపాడాలన్నదే ఈ సమావేశం సారాంశం. అందుకే మేం ఒక్కచోటికి వచ్చాం. దేశంలో ప్రజాస్వామ్యం, వ్యవస్థలను కాపాడటానికి ప్రతిపక్షాలన్నీ కలిసి పనిచేస్తాయి – రాహుల్ గాంధీ
ఈ దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ప్రస్తుతం దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే నా ప్రధాన లక్ష్యం. అందుకోసం అందరినీ కూడగడతా. అందరం సంయుక్తంగా ఒకవేదిక మీదికొచ్చి కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొందించుకొని ముందుకెళ్తాం – తెదేపా అధినేత చంద్రబాబు
ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం బలంగా ఉంది. తెలుగుదేశం, సమాజ్‌వాదీపార్టీ కలయిక పెనుమార్పులకు సంకేతం – ఎస్పీ అగ్రనేత ములాయంసింగ్
గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ప్రతి గ్రామం ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మనకు ఎదురవుతున్న సమస్యలను సమర్ధవంతంగా తిప్పికొడదామన్న అయన విభజన హామీలను అమలు చేయమన్నందుకే మనపై దాడులు చేస్తున్నారన్నారు. నేను ధర్మం,

న్యాయం కోసం పోరాడుతానని.. కులం, మతం, ప్రాంతం పేరుతో ఓట్లు అడగను అన్నారు. సేవ చేసిన వారికే ప్రజలు అండగా ఉండాలన్న చంద్రబాబు నన్ను రెచ్చగొడితే ఏమవుతుందో ఇప్పటికే వాళ్లకి అర్థమైందన్నారు. రామాయపట్నం పోర్టుకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్న అయన ప్రకాశం జిల్లాను అభివృద్ధి బాట పెట్టిస్తామని హామీ ఇచ్చారు.