కేసీఆర్ కు చంద్రబాబు షాక్: కాంగ్రెసుతో పొత్తుకు రెడీ

హైదరాబాద్: జాతీయ స్థాయిలో మారిన పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు షాక్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. తెలంగాణలో కాంగ్రెసుతో టీడీపి పొత్తుకు చంద్రబాబు దాదాపుగా అంగీకరించినట్లు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహానికి కేసీఆర్ హాజరైనప్పుడు టీడీపీ, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మధ్య పొత్తుకు పాదులు పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యంలో ఉన్న కాంగ్రెసును దెబ్బ తీయడానికి వెలమ, కమ్మ సామాజిక వర్గాన్ని ఒక్కటి చేయాలని, అందులో భాగంగా టీడీపితో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవాలని అనుకున్నట్లు వార్తలు వచ్చాయి. దాన్నే వెల్కమ్ గ్రూపుగా పిలిచారు.

అయితే, టీఆర్ఎస్ తో పొత్తుకు చంద్రబాబు ప్రస్తుతం ఆసక్తి కనబరచడం లేదని అంటున్నారు. తెలంగాణ టీడీపి నాయకులు కూడా టీఆర్ఎస్ తో కన్నా కాంగ్రెసుతో వెళ్తేనే ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి వీలవుతుందని భావిస్తున్నారు. దానికితోడు, చంద్రబాబు ప్రధాని మోడీకి దూరమై, కేసీఆర్ దగ్గరయ్యారు. ఈ స్థితిలో కాంగ్రెసుతో వెళ్లడమే మంచిదని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇరు పార్టీల మధ్య పొత్తుకు రాష్ట్ర స్థాయి నేతల మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. టీడీపి నాయకులతో మంతనాలు జరపడం ద్వారా ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇరు పార్టీల మధ్య పొత్తు చర్చల్లో పురోగతిని సాధించారు. లోకసభ, అసెంబ్లీ సీట్ల పంపకం తర్వాత పొత్తు గురించి అధికారికంగా ప్రకటన చేస్తారని అంటున్నారు.

కాంగ్రెసు, టీడీపి, వామపక్షలు, కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జనసమితిల కలయిక ద్వారా మహా కూటమిని ఏర్పాటు చేసేందుకు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవ ప్రదర్శిస్తున్నారు. దానికి ఆమోదం తెలపాలని ఆయన పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *