కుల అహంకారం వదలాలి

AP CM Chandrababu Naidu Emotional On Pranay Brutal Murder
అగ్రవర్ణ పేదలకూ చంద్రన్న పెళ్లికానుక త్వరలో అమలుచేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. సోమవారం అసెంబీల్లో ‘చంద్రన్న పెళ్లికానుక’పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ఈ పథకం గాడిలో పడిన తర్వాత అగ్రవర్ణపేదలకు కూడా వర్తింపచేస్తామని చెప్పారు. పెళ్లికానుక ఒక వినూత్న కార్యక్రమమని, దేశంలో ఇలాంటి కార్యక్రమం ఎక్కడా లేదన్నారు. వీలైనంత వరకూ సాధారణ ప్రజానీకానికి పెళ్లి భారం తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తెచ్చామన్నారు. chandrababu Naiduగతంలో మైనారిటీలకు దుల్హన్‌, ఎస్టీలకు గిరిపుత్రిక కల్యాణ పథకాల పేరుతో ఈ పథకాలు ఉన్నాయని, వాటిని అదే పేరుతో కొనసాగించాలని నిర్ణయించామన్నారు. ఈ పథకాన్ని సుస్థిర పరిచేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు.

కులాంతర వివాహాలను తమ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘చంద్రన్న పెళ్లి కానుక’ల్లో వీటికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. ఇటీవల తెలంగాణలోని మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య(ప్రణయ్‌ హత్య)ను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావిస్తూ కొంత భావోద్వేగానికి లోనయ్యారు. Chandra Bau Niduఅగ్ర కులం అనే అహంకారం వద్దు, మూఢనమ్మకాలను వదిలిపెట్టాలని సూచించారు. అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు ఇష్టపడితే ఆశీర్వదించి పెళ్లిచేయాలన్నారు. చిన్న పిల్లలకు పెళ్లిళ్లు చేసే దురాచారాన్ని మానుకోవాలని, అవగాహన లేని వయసులోనే ఆడపిల్లలకు పెళ్లి చేస్తే అనేక అనర్థాలకు దారితీస్తుందని ఈ సందర్భంగా చంద్రబాబు సూచించారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *