నాలెడ్డ్జ్ ఉంటే మనల్నిఎవరూ ఆపలేరు

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని భవిష్యత్‌లో ఇన్నోవేషన్‌ వ్యాలీగా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలోని రాయపూడి వద్ద ప్రవాసాంధ్రులకు నిర్మించ తలపెట్టిన ఎన్‌ఆర్‌టీ ఐకాన్‌ టవర్‌ నిర్మాణానికి చంద్రబాబు శుక్రవారం భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, సీఆర్‌డీఏ అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ప్రవాసాంధ్రులు ఏ దేశంలో స్ధిరపడినా జన్మభూమిని మాత్రం మరిచిపోవద్దు. నేను గతంలో ముఖ్యమంత్రి ఉన్న సమయంలో ఐటీ రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. అందువల్లే ఎంతోమంది తెలుగువారు సాఫ్ట్ వేర్‌ ఉద్యోగులుగా విదేశాల్లో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంతోమంది ఇంజినీర్లుగా, వైద్యులుగా విదేశాలకు వెళ్లి సత్తా చాటారు. సాఫ్ట్ వేర్‌ రంగానికే తలమానికమైన అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో ఎక్కువమంది తెలుగువారే ఉన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌ను ప్రపంచపటంలో పెట్టాం. ఇప్పుడు అమరావతిని ప్రపంచ నగరంగా తీర్చిదిద్దుతున్నాం. ఇన్నోవేషన్‌ వ్యాలీ అంటే భవిష్యత్‌లో అమరావతే గుర్తుకురావాలి.
నాలెడ్డ్జ్ ఉంటే మనల్ని ఎవరూ ఆపలేరు. జేఈఈలో మన విద్యార్థులే అత్యధికంగా అర్హత సాధిస్తున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ తెలుగువారు రాణించాలి. ప్రపంచానికి సేవ చేసే ఏకైక జాతి తెలుగుజాతే అని గుర్తింపు తీసుకురావాలి’ అని అన్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *