BEZAWADA TODAY

హంసలదీవి పాలకాయతిప్ప బీచ్ లో విజయవాడకు చెందిన యువకుడు గల్లంతు

September 23, 2018

హంసలదీవి పాలకాయతిప్ప బీచ్ లో విజయవాడకు చెందిన యువకుడు గల్లంతు. ఎస్ ఆర్ కె కళాశాలకు చెందిన 10 మంది విద్యార్థులు ఆదివారం ఉదయం విహార యాత్రలో భాగంగా దీనికి వచ్చారు. వీరంతా సాగరసంగమం వద్దకు వెళ్లి స్నానాలు ఆచరించి సరదాగా గడిపారు అనంతరం palakayatippa బీచ్ లో స్నానాలు చేస్తున్నారు. ఆ సమయంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో విద్యార్థి జై తుల్లా సముద్రంలోకి కొట్టుకుపోయాడు. హటాత్పరిణామానికి తోటి విద్యార్థులు కంగారు పడుతూ అక్కడే ఉన్న […]

Read More

జన్మభూమి గురుతులు చెట్ల సంరక్షణలో గ్రామస్థుల ఆదర్శం

September 23, 2018

టేకుచెట్లపాలెం జన్మభూమి గురుతులు చెట్ల సంరక్షణలో గ్రామస్థుల ఆదర్శం న్యూస్‌టుడే, రావివారిపాలెం(మోపిదేవి) జన్మభూమి.. ఆ గ్రామానికి స్ఫూర్తినిచ్చింది. పర్యావరణ సమతుల్యానికి ప్రాధాన్యమివ్వాలనే ప్రభుత్వ ఆశయాన్ని అందుకున్న ఆ గ్రామస్థులు 15 సంవత్సరాల క్రితం నాటిన మొక్కలు నేడు కల్పవృక్షాలుగా మారాయి. ఇళ్ల ముంగిట నిటారుగా పెరుగుతూ టేకుచెట్లు ఆ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. అదే కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి పంచాయతీ శివారు గ్రామమైన రావివారిపాలెం. గ్రామంలో దాదాపు 300 ఇళ్లుంటే 250పైగా గృహాల్లో […]

Read More

ఏలూరు రహదారికి రూ.35 కోట్లతో మెరుగులు

September 23, 2018

రహదారి ప్రమాదాలకు కారణమైన ఏలూరు రహదారిని మరింత పటిష్టం చేసేందుకు జాతీయ రహదారుల సంస్థ చర్యలు తీసుకోనుంది. గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ, అమరావతి నగరాలకు నిత్యం ఎంతోమంది ప్రముఖులు వస్తుంటారు. దేశ విదేశాల నుంచి ప్రముఖుల పర్యటనలు ఉంటుంటాయి. ఈ నేపథ్యంలో జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌16) కొంత ప్రమాదకరంగా మారింది. దీన్ని పటిష్టం చేసేందుకు రూ.35 కోట్లు మంజూరు చేసింది. విజయవాడ నేతాజీ వంతెన నుంచి చినఆవుటపల్లి వరకు ఈ జాతీయ రహదారిని ప్రత్యేక మరమ్మతుల […]

Read More

25న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయండి

September 23, 2018

తిరువూరు: విద్యారంగం పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరనసగా ఈనెల 25న రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టిన రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సోమేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో శనివారం ఆయన విద్యార్థులతో కలిసి బంద్‌ గోడపత్రికలను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రాన్ని నాలెడ్జ్‌ హబ్‌గా చేస్తామని చెబుతున్న ప్రభుత్వం విద్యారంగ సమస్యలను విస్మరించిందని ఆరోపించారు. జ్ఞానభేరి పేరిట ఎన్నికలకు ముందు ప్రచారభేరి […]

Read More

విజయవాడలో పరువు హత్య పోస్టర్ల కలకలం

September 22, 2018

విజయవాడలో ఆకాతాయిలు పెట్టిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పరువు హత్యకు గురికానున్న సోని.. రాహు‌.. ప్రియ అని రాసిన పోస్టర్లు వెలిశాయి. సత్యనారాయణపురం శివాలయం వీధి నిండా ఈ పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఇదంతా ఎవరో ఆకతాయిల పనే అయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. అమ్మాయిని భయపెట్టేందుకు ఇలా చేసి ఉంటారని భావించి.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోస్టర్లను పరిశీలించిన పోలీసులు.. సోని రాహు‌ ప్రియ ఎవరు?.. పోస్టర్లు వేసింది ఎవరు అనే కోణంలో విచారణ చేపట్టారు.. Caste […]

Read More

బెజవాడలో క్రాస్ మసాజ్… పట్టుబడిన 11 మంది యువతులు!

July 27, 2018

మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం పురుషులకు మహిళలతో మసాజ్ ఆకస్మిక దాడులు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు విజయవాడలో మసాజ్ సెంటర్ల ముసుగులో అశ్లీల కార్యకలాపాలు సాగుతున్నాయని, పురుషులకు మహిళలతో మసాజ్ లు చేయిస్తూ, వారితో వ్యభిచార దందా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో పోలీసులు వరుసగా దాడులు చేస్తున్నారు. ఈ క్రమంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి, నగర పరిధిలోని మొగల్రాజపురం, లబ్బీపేట, గురునానక్ కాలనీల్లో ఉన్న మసాజ్ సెంటర్లపై ఆకస్మిక దాడులు చేశారు. […]

Read More

జగన్ అధికారంలో కీ వస్తే..క్యాబినెట్లో…. హోంమంత్రి ఫిక్స్…

July 26, 2018

YS Jagan || జగన్ అధికారంలో కీ వస్తే..క్యాబినెట్లో…. హోంమంత్రి ఫిక్స్…

Read More

విజయవాడ లో అభ్యంతరకర నృత్యాలు

July 19, 2018

విజయవాడ: భవానీపురంలో కిట్టీ పార్టీల పేరిట అభ్యంతరకర నృత్యాలు చేస్తున్న వారిని పోలీసులు గురువారం అదుపులోనికి తీసుకున్నారు. భవానీపురం బ్యాంకు సెంటర్‌ వద్ద ఉన్న ఓ హోటల్‌లో రేవ్‌ పార్టీ నిర్వహిస్తున్నట్లు వచ్చిన సమాచారంతో బుధవారం రాత్రి పోలీసులు ఆకస్మిక తనిఖీ చేశారు. ఐదుగురు మహిళలతో కలిసి 53 మంది పురుషులు అభ్యంతరకర నృత్యాలు చేస్తున్నట్లు గుర్తించారు. విజయవాడతో పాటు భీమవరం, హైదరాబాద్‌ నుంచి మహిళలను ఇక్కడకు తీసుకొచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వీరిలో ఎనిమిది మందికి […]

Read More
Anna Canteen

అన్న క్యాంటీన్‌కు రూ.లక్ష విరాళం ఇచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్త

July 12, 2018

ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ కుటుంబరావు గారు అన్న క్యాంటీన్‌కు రూ.లక్ష విరాళం ఇచ్చారు, అదేవిధంగా ప్రతి నెల పది టన్నుల కూరగాయలు ఇస్తానని సీఎం చంద్రబాబుకు తెలి పారు. ఏ కన్వెన్షన్‌లో బుధవారం జరిగిన అన్న క్యాంటీన్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రూ.లక్ష నగదుతో పాటు అక్షయపాత్ర సంస్థకు కూరగాయలు అందిస్తానని తెలిపారరు.

Read More
Municipal workers

నందిగామలో సమ్మెను ఉద్రిక్తం చేస్తున్న మున్సిపల్ కార్మికులు

July 11, 2018

కృష్ణా జిల్లా నందిగామలో మున్సిపల్ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా మారింది. తమ డిమాండ్ల సాధన కోసం మున్సిపల్ కార్మికుల గత 12 రోజులుగా సమ్మెతో నగరంలో చెత్తా చెదారం భారీగా పేరుకుపోయింది. దీంతో మున్సిపల్‌ అధికారులు ప్రైవేట్‌ వ్యక్తులను రంగంలోకి దింపి పనిచేయుస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న కార్మికులు పనులను అడ్డుకుని గొడవలకుకు దిగారు. దీనితో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడకు చేరుకుని కార్మికులను అడ్డుకున్నారు. దీంతో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మున్సిపల్ కార్మికులు ఆందోళనకు […]

Read More