
ఏపీలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోతున్నాయి. అటు బీజేపీ.. ఇటు టీడీపీ తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. సుజనా చౌదరి, అశోక్‌గజపతిరాజు రాజీనామా చేయడానికి కొన్ని నిమిషాల ముందు ప్రధాని మోదీ నుంచి చంద్రబాబుకు ఫోన్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారాలన్నింటిపై మాట్లాడేందుకు సీఎం చంద్రబాబు అందుబాటులో ఉన్న మంత్రులతో అత్యవసరంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని ఫోన్ సంభాషణ విషయం ప్రస్తావనకు వచ్చింది. ” కూర్చొని మాట్లాడుకుందాం.. తొందరపడొద్దని మోదీ చెప్పారు. మోదీ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాను. మంత్రులు రాజీనామా చేసినా మేం ఎన్డీయేలో ఉన్నామని ప్రధానికి చెప్పాను. ఇందుకు స్పందించిన మోదీ ఏపీకి న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. ప్రజల భావోద్వేగం, ఏపీ అవసరాల దృష్ట్యా రాజీనామాల నిర్ణయం తీసుకున్నామని మోదీకి వివరించాను. ప్రజాభిప్రాయం, ఏపీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నామని ప్రధానికి తెలిపాను. విభజన చట్టాన్ని అమలు చేయాలని నాలుగేళ్లుగా కోరుతున్నామని హోదా అంశం ఏపీలో సెంటిమెంట్‌గా మారిందని మోదీకి మరోసారి చెప్పాను” అని అత్యవసర సమావేశంలో మంత్రులకు చంద్రబాబు వివరించారు.
ఈ సమావేశానికి కళా వెంకట్రావు, సోమిరెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నారాయణ, పుల్లారావు, లోకేష్, యనమల ప్రధానితో ఫోన్లో మాట్లాడిన వివరాలు, తాజా పరిణామాలపై చర్చ పై విధంగా సాగింది.
ap cm chandra babu naidu, pm modi, Phone call, ap politics