buddha venkanna fires on gvl narasimharao

నీ అవినీతి చిట్టా నా దగ్గరుంది: బుద్దా వెంకన్న
గత కొద్దిరోజులుగా టీడీపీ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విమర్శలపై టీడీపీ నేతలు, మంత్రులు సైతం అదే రీతిలో కౌంటర్లు పేలుస్తున్నారు. తాజాగా.. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ జీవీఎల్ పెద్ద పవర్ బ్రోకర్ అని వ్యాఖ్యానించారు. జీవీఎల్ అవినీతి సంపాదన చిట్టా మొత్తం తన దగ్గరుందని బుద్దా చెప్పుకొచ్చారు. ఆయన అవినీతిని త్వరలో నిరూపిస్తానని అలా కాని పక్షంలో.. రాజకీయాలతో పాటు రాష్ట్రం నుంచి వెళ్లిపోతానని ఈ సందర్భంగా ఛాలెంజ్ చేశారు.

జీవీఎల్ అసలేమన్నారు..!
గురువారం మీడియాతో మాట్లాడిన జీవీఎల్.. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌గా హరివంశ్ ఎన్నిక కావడంతో తెలుగుదేశం పార్టీకి మరోసారి పరాభవం ఎదురైందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌లా టీడీపీ కూడా అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. స్కాములపై టీడీపీ సమాధానం చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. త్వరలో టీడీపీని ప్రజల ముందు దోషిగా నిలబెడతామని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు రియాక్ట్ అయిన బుద్దా వెంకన్న పై వ్యాఖ్యలు చేశారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *