నెలకు 700 రూపాయలు మీ అకౌంట్ లో జమవుతుంది, అదెలాగో తెలుసా …?

రేషన్ షాపుల ముందు గంటల కొద్ది క్యూలలో నిలబడే జనాలను మనం చూశాం. రేషన్ షాప్ డీలర్ల చేత మాటలు పడినవారెందరో. రేషన్ ఉంచుకొని లేదని చెప్పడం, ఇవ్వాల్సిన దానికంటే తక్కువ రేషన్ ఇవ్వడం… ఇలాంటివి సర్వసాధారణం. పబ్లిక్ కు ఇవ్వాల్సిన రేషన్ బియ్యం, కిరోసిన్, చక్కెర, కందిపప్పు, చింతపండు… ఇలా ఎన్నో వస్తువులను బ్లాక్ మార్కెట్ లో విక్రయించి కోట్లు గడించారు చాలా మంది రేషన్ డీలర్లు, వారిని అజమాయిషీ చేసే అధికారులు. ఇప్పుడు ఇక ఆ బెంగ అవసరంలేదని చెబుతోంది సర్కార్. రేషన్ షాప్ కు వెళ్ళి గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం అసలే లేదంటోంది.

రేషన్ షాప్ లలో జరుగుతున్న అక్రమాలు అలాగే, రేషన్ తీసుకున్న వ్యక్తులు బియ్యాన్ని బయట ఎక్కువ ధరకు అమ్ముకోవడాన్ని మనం చూశాం. ఇది గమనించిన కేంద్ర ప్రభుత్వం…దీనికి పరిష్కారాన్ని ఆలోచించింది. అందుకు తగ్గట్టుగా ఓ పథకాన్ని తయారు చేసిందని ఓ వార్త బయటికొచ్చింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తమకు ఓట్ల వర్షం కురిపించేందుకు అనేక ఆర్థిక లబ్ది చేకూర్చే పథకాలను కేంద్ర ప్రభుత్వం వెతుకుతుండగా అందులో ఒకటి రేషన్ వస్తువులకు బదులుగా డబ్బు ఇవ్వడం, ఇళ్లపేరిట సబ్సిడీ ఇవ్వడం అనేవి ప్రభుత్వ పెద్దల దృష్టికి వచ్చాయట. అందుకే ప్రభుత్వ అనుకున్న ఈ కొత్త పథకం అమల్లోకి వస్తే…

ఇకపై ఎవరూ కూడా రేషన్ షాపులకు వెళ్లాల్సిన అవసరం లేదు. రేషన్ షాప్ లలో రేషన్ లేదని దిగులు పడాల్సిన అవసరం కూడా ఉండదు. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా రేషన్ కార్డు ఉన్న వ్యక్తుల అక్కౌంట్ లోకి ప్రతినెలా 700 రూపాయల నగదును బదిలీ చేసే ఏర్పాటు చేయబోతుందట. ఆరుగురు వ్యక్తులున్న ఇంటికి ఒక్కొక్కరికి నాలుగు కేజీల చొప్పున బియ్యం ఇస్తుంది. అంటే 24 కేజీలు. ఒక్కో కేజీకి 25 రూపాయల చొప్పున చెల్లించే ఏర్పాటు చేసింది. అంటే 640 రూపాయలు. మిగతా వాటితో కలిపి 700 రూపాయలను కేంద్రం వారి అక్కౌంట్లోకి బదిలీ చేస్తుందని సమాచారం, అలా అక్కౌంట్ లోకి బదిలీ అయిన 700 రూపాయలతో ఎవరి ఇష్టం వచ్చిన వస్తువులను వారు కొనుగోలు చెయ్యొచ్చు. ఈ పథకాన్ని ఇప్పటికే పుదుచ్చేరి, చండీఘర్, దాద్రానగర్ హవేలీలో అమలులో ఉంది. ఈ పథకం అక్కడ విజయవంతం కావడంతో.. మిగతా రాష్ట్రాల్లో కూడా వీటిని అమలు చేయాలని నిర్ణయించిందని సమాచారం.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *