హంసలదీవి పాలకాయతిప్ప బీచ్ లో విజయవాడకు చెందిన యువకుడు గల్లంతు

హంసలదీవి పాలకాయతిప్ప బీచ్ లో విజయవాడకు చెందిన యువకుడు గల్లంతు. ఎస్ ఆర్ కె కళాశాలకు చెందిన 10 మంది విద్యార్థులు ఆదివారం ఉదయం విహార యాత్రలో భాగంగా దీనికి వచ్చారు. వీరంతా సాగరసంగమం వద్దకు వెళ్లి స్నానాలు ఆచరించి సరదాగా గడిపారు అనంతరం palakayatippa బీచ్ లో స్నానాలు చేస్తున్నారు. ఆ సమయంలో అలల ఉధృతి ఎక్కువగా ఉండడంతో విద్యార్థి జై తుల్లా సముద్రంలోకి కొట్టుకుపోయాడు. హటాత్పరిణామానికి తోటి విద్యార్థులు కంగారు పడుతూ అక్కడే ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చారు వెంటనే వెతుకులాట ప్రారంభించిన జై తుల్లా ఆచూకీ లభ్యం కాలేదు. పాలకాయతిప్ప మెరైన్, కోడూరు పోలీసులు గల్లంతయిన యువకుడి ఆచూకీ కోసం వెతుకులాట ప్రారంభించారు

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *