బెజవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దూసుకుపోతున్న యువకుడు

“తండ్రి బాటలో తనయుడు”.

బెజవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దూసుకుపోతున్న బోండా ఉమ గారి తనయుడు బోండా సిద్ధార్థ.

తండ్రి మంచి మాస్ లీడర్.
గ్రౌండ్ లెవెల్ నుండే ప్రజలతో మంచి సాన్నిహిత్యం ఉంది.
సమస్య తన దృష్టి కి వస్తే వెంటనే యుధ్దప్రాతిపదికన, సమస్యలను పరిష్కరించే లీడర్..

అదే వారసత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్నాడు బోండా సిధ్దార్థ..

ఎక్కడ ఉన్నా మన నియోజకవర్గంలో కార్యకర్తలు ఎలా ఉన్నారు? వారి బాగోగులు గురించి విచారించడమే కాకుండా…
ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? లేదా? అనీ స్వయంగా తెలుసుకుంటూ..
వారికి చేదోడు వాదోడుగా కుటుంబ సభ్యుడుగా అందరికీ అందుబాటులో ఉంటూ వారి జీవితాలలో భరోసా నింపు తున్నాడు బోండా సిద్దార్థ.

బెజవాడ సెంట్రల్ నియోజకవర్గంలో
పార్టీ తరఫున, ప్రభుత్వం తరుపున చాలామంది ప్రయోజనం పొందిన కుటుంబాలనీ స్వయంగా వారి ఇంటికెళ్లి పరామర్శించి మీకు ఏ కష్టమొచ్చినా “మేం అండగా ఉంటామంటూ” సిద్దార్థ భరోసా ఇచ్చే విధానం అటు బోండా ఉమా అభిమానులకు,ఇటు తెలుగుదేశం కార్యకర్తలకు మంచి ఊపునిస్తుంది.

ఎంతోమంది ని ప్రజాభరోసా యాత్రలొ కలుస్తూ ఉన్నప్పుడు…
ప్రజల నుండి వచ్చే అపూర్వ ఘన స్వాగతం, ఆ విశేష స్పందన చూస్తుంటే నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం, బోండా ఉమాగారూ వారికెన్ని పనులు చేస్తేనే కదా వారు ఆ విధంగా స్పందిస్తున్నారు అనీ అంటున్నారు సామాన్య జనం..

అంతేకాకుండా కష్టాలలో ఉన్నవారిని చూసి పలకరించి వారికి తన వంతు సాయం చేస్తూ,వారికి ప్రభుత్వ పరంగా ఎటువంటి సాయం చేయగలమో అన్నింటినీ నోట్ చేసుకోగలుగుతూ…
యువతలో సామాజిక చైతన్యం పెంపొందించాలనీ,నవతరం నిర్మాణానికి తన నియోజకవర్గంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు బోండా సిద్దార్థ..

చంద్రన్న భీమా, సి.ఎం.సహాయనిధి, NTR వైద్య సేవ,NTR ఆరోగ్య రక్ష వంటి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్దిపొందిన గృహాలకు స్వయంగా వెళ్ళి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.

ఒకవైపు వర్షం పడుతున్న డివిజన్లలో, వార్డ్ లలో నడక ఆపలేదు, జనంతో కలుస్తూ,మమేకం అవుతూ..
అతడు చూపించే ఆ అభిమానం
అతని మంచి మనస్సు ను సూచిస్తుంది.

సిద్దార్థ రాకతో అటు కేడర్ కూడా ఫుల్ జోష్ తో జనంలోకి వెళ్లడం తో
పార్టీ కి మరోసారి బెజవాడ నడిబొడ్డున బంపర్ మెజారిటీ ఖాయమంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

తరచూ అసత్య ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష సభ్యుల మాటలను ప్రజలు పట్టించుకొనే స్థితిలో లేరు, మాకు తెలుసయ్యా మా బోండా ఉమా గురించి
“ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపిన గొప్ప వ్యక్తి, మా కుటుంబ సభ్యుడిలా కలిసిపోతారు ఆయన,ఎన్ని ఆరోపణలు చేసినా ….

బోండా ఉమా గారు చేసిన పనులు
కష్టపడే మనస్తత్వం మా గుండెల్లో చెరగని ముద్రవేసాయి,వాటిని ఎలాంటి అసత్య ఆరోపణలు మా నుండి ఆయన్ని దూరం చేయలేవు.
మళ్ళీ ఈసారి అఖండ మెజారిటీతో ఆయన్ని గెలిపించి, ఆయన ఋణం తీర్చుకుంటాం అనీ యువత,పెద్దవారు అనడం ”

అవన్నీ విని,చూసిన సిద్దార్థ ఉద్వేగానికి లోనవడం…


మరింతగా మనం జనంలోకి వెళ్లాలన్న స్ఫూర్తిని సిధ్దార్థకు ఇచ్చాయనీ” అంటున్నారు వారి అభిమానులు..

సిద్దార్థ తండ్రి బాటలో పయనిస్తూ..
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న అన్నగారి సిద్దాంతాన్ని ఫాలో అవుతూ,జనంలో పార్టీ ఇమేజ్ ని,ప్రభుత్వ పథకాలను తీసుకెలుతూ తండ్రికి కుడి భుజంలా, అండగా ఉంటున్నాడు అనీ అనడం లో అతిశయోక్తి లేదు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *