
ఇవాళ జరగబోయే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారు.ఇటీవల కేంద్రం ప్రదేశ పెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి ప్రత్యేకత చూపలేదని, ఈ బడ్జెట్ చాలా దారుణం గా ఉందని, కావాలని ఆంధ్రాకు అన్యాయం చేస్తున్నారని సీఎం చంద్రబాబుతోపాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు తీవ్ర నిరాశ చెందారు. అమరావతికి నిధులు వంటి అంశాల ప్రస్తావన లేకపోవడం చాలా బాధాకరం అని అసంతృప్తి వ్యక్తం చేసారు.
పోలవరం ప్రాజెక్ట్‌కి కేంద్రం బాధ్యత అయిన తాము ముందుకు వచ్చి చేస్తున్నా, నిధుల సమీకరణ నాబార్డు ద్వారా ఏర్పాటు చేశారు,కానీ నిధులు ఇవ్వటం చెప్పుకోదగిన రీతిలో లేదన్నారు. ఎక్కడెక్కడో మెట్రోలు ఇచ్చారు కానీ విజయవాడ, విశాఖపట్నం నగరాలకు మెట్రో ప్రస్తావన, రైల్వే జోన్ లేదని మండిపడ్డారు. ఆంధ్రా మీద సవతి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు.
మరో వైపు ఏపీకి అన్నివిధాల కేంద్రం నిధులు మంజూరు చేస్తూ ఆదుకుంటుందని ఏపీ బీజేపీ నేతలు ప్రచారం చేస్తూ, టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంతో తెగతెంపులు చేసుకోవడమా? లేక మిత్ర పక్షంగా కొనసాగుతూ పోరాటం చేయాలన్నదానిపై ఆదివారం చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీపీ సమాశం జరగనుంది.ఈ నేపధ్యం లో చంద్రబాబు కి ఫోన్ చేసిన అమిత్ షా త్వరలోనే అన్ని విషయాలపై చర్చిద్దామని అన్నారు.ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో …