బిగ్ బాస్ తెలుగు 2 : ఆమెతో పాటు 16 మంది పేర్లు కూడా తెరపైకి

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో రెండో సీజన్ జూన్ 10 నుండి ప్రారంభించబోతున్నట్లు నిర్వాహకులు ప్రకటించినన సంగతి తెలిసిందే. హీరో నాని హోస్ట్ చేస్తున్న ఈ షో 100 రోజుల పాటు 16 మంది సెలబ్రిటీలతో ఆసక్తికరంగా సాగనుంది. అయితే ఇందులో పాల్గొనబోయే 16 మంది సెలబ్రిటీలు ఎవరు? అనేది హాట్ టాపిక్ అయింది. కంటెస్టెంట్స్ వివరాలు ముందే వెల్లడించకుండా షో ప్రారంభం అయ్యే రోజు వరకు సస్పెన్స్‌గానే ఉంచాలని షో నిర్వాహకులు నిర్ణయించారు. కానీ ఇప్పటికే కొందరి పేర్లు ప్రచారంలోరి వచ్చాయి. ఈ లిస్టులో శ్రీరెడ్డి పేరు వినిపించడంపై అంతా షాక్ అవుతున్నారు.

శ్రీరెడ్డి పేరు వినిపించడంతో అంతా షాక్
కాస్టింగ్ కౌచ్ అంశంతో వార్తల్లోకి ఎక్కిన శ్రీరెడ్డి పేరు కూడా బిగ్ బాస్ సీజన్ 2 విషయంలో హాట్ టాపిక్ అయింది. హీరో నాని మీద శ్రీరెడ్డి ఆరోపణలు చేసినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డికి బిగ్ బాస్ ఇంట్లో అవకాశం ఉండక పోవచ్చని భావిస్తున్నారు.

హీరోయిన్ చార్మి
బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొనే కంటెస్టెంట్స్‌లో హీరోయిన్ చార్మి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఒకప్పుడు హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన చార్మి తర్వాత అవకాశాలు తగ్గి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. ఆమె సహ నిర్మాతగా వ్యవహరించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయం అందుకోలేదు. ఇటీవల నిర్మించిన ‘మోహబూబా’ కూడా నష్టాలనే మిగిల్చింది.

సింగర్ గీతా మాధురి
తన హస్కీ వాయిస్‌తో తెలుగు సినిమా రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సింగర్ గీతా మాధురి…… బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్లో పాల్గొనబోతోంది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

యాంకర్ శ్యామల
తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలో యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో శ్యామల ఒకరు. బిగ్ బాస్ 2 సెకండ్ సీజన్ కంటెస్టెంట్ల లిస్టులో ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

సీనియర్ నటి రాశి పేరు కూడా
ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుతం క్యారెక్టర్ రోల్స్ చేస్తున్న సీనియర్ నటి రాశి పేరు కూడా ఈ లిస్టులో ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలోనే ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

యాంకర్ లాస్య
యాంకర్ లాస్య…. టెలివిజన్ రంగంలో ఒకప్పుడు పాపులర్ యాంకర్. మరో యాంకర్ రవితో కలిసి అనేక షోలు చేశారు. తర్వాత రవి మీద సంచనల ఆరోపణలు చేసి వార్తల్లోకి ఎక్కారు. బిగ్ బాస్ సీజన్ 2కు సంబంధించి లాస్య పేరు కూడా వినిపిస్తోంది.

మాజీ హీరోయిన్ గజాల
ఒకప్పుడు తెలుగు సినిమా రంగంలో హీరోయిగా పలు చిత్రాల్లో నటించిన గజాల తర్వాత తెరమరుగైంది. మళ్లీ ‘బిగ్ బాస్ తెలుగు 2’ ద్వారా ఆమె తెలుగు ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు సమాచారం.

చాందినీ చౌదరి
యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సీరీస్‌ల ద్వారా పాపులర్ అయిన చాందినీ చౌదరి కొన్ని సినిమాలో హీరోయిన్‌గా కూడా అవకాశం దక్కించుకుంది. బిగ్ బాస్ సీజన్ 2కు సంబంధించి ఈ బ్యూటీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

జూనియర్ శ్రీదేవి
ప్రభాస్ హీరోగా నటించిన ‘ఈశ్వర్’ మూవీలో హీరోయిన్‌గా నటించిన జూనియర్ శ్రీదేవి పేరు బిగ్ బాస్ సీజన్ 2కు సంబంధించి కంటెస్టెంట్స్ లిస్టులో వినిపిస్తోంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *