ఎవరి సీజన్‌లో ఎక్కువ డబ్బులొచ్చాయో చెప్పేశారు!

మా టివి చేతులు మారి ‘స్టార్‌మా’గా బుల్లితెర మీదకు వచ్చిన తర్వాత తెలుగు రాష్ర్టాల్లో స్థానిక కళాకారులు, టెక్నీషియన్లకు చక్కని అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని కంపెనీ బిజినెస్‌ హెడ్‌ అలోక్‌ జైన్‌ అన్నారు. ముఖ్యంగా రియల్టీ షో బిగ్‌బాస్‌ ప్రసారం అయిన తర్వాత స్థానిక టెక్నీషియన్లు అధికంగా రిక్రూట్‌ అయ్యారని చెప్పారు. రెండేళ్ల స్టార్‌ మా ప్రయాణం, అది ఐదో స్థానం నుంచి అగ్రస్థానానికి చేరడం, బిగ్‌ బాస్‌ రెండు సీజన్లకు లభించిన ప్రేక్షకాదరణ వంటి వివరాలన్నీ ఆయన ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…

Image result for big boss telugu 1 and 2

స్టార్‌ మా యాజమాన్యం లోకల్‌ టాలెంట్‌ని వెలుగులోకి తీసుకురావడానికి ప్రాధాన్యం ఇస్తోంది. అంతకు ముందున్న డబ్బింగ్‌ కంటెంట్‌ స్థానంలో పూర్తిగా తెలుగు కంటెంట్‌ ప్రవేశపెట్టడంతో స్థానిక కళాకారులు, సరఫరాదారులు, టెక్నీషియన్లకు మంచి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. వారి ఆదాయాలు కూడా పెరిగాయి.
రియాలిటీ షో బిగ్‌బాస్‌ ప్రాజెక్టు చేపట్టిన తర్వాత రెండు సీజన్లలోనూ అత్యధిక ప్రేక్షకాదరణతో దూసుకుపోతోంది. సీజన్‌ 1 షూటింగ్‌ అంతా ముంబైలోనే జరిగింది. అందుకు భిన్నంగా సీజన్‌ 2 హైదరాబాద్‌లోనే షూట్‌ అవుతోంది. ఇది ఎంతో మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు అందుబాటులోకి తెచ్చింది.

Image result for big boss telugu 1 and 2
సీజన్‌ 2లో షో నడిచే కాలవ్యవధిని 110 రోజులకి పెంచాం. సీజన్‌ 1లో షో 70 రోజులే నడిపాం. షో కాలవ్యవధిని పెంచడం, దానికి ముందస్తుగా ఏర్పాట్లు చేయడం, షో ముగిసిన తర్వాత కూడా సెట్టింగ్‌లు అవి తొలగించడం వంటి కార్యకలాపాలు…అటూ, ఇటూ కలిపి మొత్తం 150 రోజులు నిరంతరాయంగా ఉపాధి లభించింది. ఈ ప్రాజెక్టుపై 500 మంది పని చేస్తుంటే 400 మంది స్థానికులే. ఇన్ని రోజులూ వారి కుటుంబాలకు స్థిరమైన ఆదాయాలు అందుతున్నాయి.

Related image
సీజన్‌ 1తో పోల్చితే సీజన్‌ 2లో బిగ్‌బాస్‌ ప్రాజెక్టుపై మేం పెట్టిన వ్యయాలు, మాకు వచ్చిన ఆదాయాలు కూడా నాలుగురెట్లు పెరిగాయి. మాకున్న పరిమితుల దృష్ట్యా గణాంకాలు వెల్లడించే అవకాశం లేదు. అలాగే ప్రకటనకర్తలకు వచ్చిన ఆదాయాలు కూడా రెండింతలు పెరిగిపోయాయి. అమెజాన్‌, ఒప్పో, డాబర్‌, గుడ్‌నైట్‌ వంటి ప్రముఖ కంపెనీలు, బ్రాండ్లు దీనికి స్పాన్సర్లుగా ఉన్నాయి.
సీజన్‌ 1లో బిగ్‌బా్‌సకి 16.2 శాతం రేటింగ్‌ వస్తే సీజన్‌ 2 నేరుగా 15.2 శాతం రేటింగ్‌తో మొదలైంది. సీజన్‌ 1తో పోల్చితే రోజువారీ ప్రసార సమయం కూడా రెండు గంటల నుంచి రెండున్నర గంటలకి పెరిగినందువల్ల ప్రారంభ రేటింగ్‌ చాలా ప్రోత్సాహకరమైనదనే భావించాలి.
రానున్న కాలంలో కూడా మా నుంచి ఎన్నో భారీ ప్రాజెక్టులు రానున్నాయి. వాటిలో స్థానిక ప్రతిభకే పట్టం కడతాం. ప్రతిభతో ముందుకి వచ్చే వారికి స్టార్‌మాలో అవకాశాలకు కొదవే లేదు.
SOURCE : andhrajyothy

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *