
బిగ్‌బాస్ మొదటి సీజన్ మంచి స్పందన రావడంతో బిగ్‌బాస్ రెండో సీజన్ భారీ అంచనాల మధ్య మొదలైంది. సీజన్ 1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తే సీజన్ 2కి నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్నాడు. కానీ ఎన్టీఆర్ ఆకట్టుకున్నంతగా నాని ఆకట్టుకోలేకపోతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
షోలోని సెలబ్రిటీస్ ఎవరూ పెద్దగా ఫేమస్ కాకపోవడం దీనికితోడు హోస్‌మెట్స్ మధ్య సంబాషణలు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాయని టాక్. దీనితో సీజన్ 2కి రేటింగ్ సీజన్ 1కి వచ్చినంత రేటింగ్ రావట్లేదని అంటున్నారు. దీనితో ఎలాగైనా బిగ్ బాస్-2 మంచి రేటింగ్ తీసుకురాలని షో నిర్వాహకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.దీనితో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా ఓ యువ హీరోయిన్ని తీసుకురాలని బిగ్‌బాస్ టీం ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే వైల్డ్‌కార్డు ద్వారా నందిని ఎంట్రీ ఇచ్చింది. అయితే నందిని వల్ల షోకి పెద్దగా ఉపయోగం లేదని, దీంతో కుమారి 21 ఎఫ్ సినిమాలో నటించి యూత్‌కి నిద్ర పట్టకుండా చేసిన హెబ్బా పటేల్‌ని ఈ షోలోకి వైల్డ్‌కార్డ్ ద్వారా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఈ వారం షో లో ఆమె అంగీకరించిందా.. లేదా? అన్నది తెలియచేస్తారు అని సమాచారం.