
బూతు చిత్రంలో ‘భరత్ అనే నేను’ బ్యూటీ
న భూతో న భవిష్యతి’ అనే చందం ‘బూతే భవిష్యత్తు’ అన్నట్లు ఆ బాలీవుడ్ మేకర్లకు అర్థమైనట్లు ఉంది. అందుకే.. ట్యాలెంట్‌ని పక్కనపెట్టేసి కేవలం బూతు మీదే చిత్రాలు చేస్తున్నారు. కొద్దిపాటి మసాలా ఉంటే తప్పు లేదు.. బూతే ప్రధానంగా సినిమాలు తీయడం నిజంగా చాలా చీప్!
సరే.. మేకర్స్కంటే బుద్ధి లేదు.. బిజినెస్ కోసం వాళ్ళు ఈ చెత్తను తీస్తున్నారనుకుందాం.. ట్యాలెంట్ ఉన్న అమ్మాయిలకేమైంది? అందంలోనే కాకుండా నటనలోనూ ఎందరో ప్రతిభావజ్ఞులతో శభాష్ అనిపించుకున్న వాళ్ళే ఇలాంటి దరిద్రపుగొట్టు సినిమాల్లో నటించడం మరీ సిగ్గుచేటు! చెప్పడానికేమో.. తాము అలాంటి వాళ్ళం కాదు, బూతుని ఎంకరేజ్ చేయము, డిఫరెంట్ సినిమాల్నే ఇష్టపడతాం, ఆ తరహా మూవీలే చేస్తాం అంటూ గొప్పలు చెప్పుకుంటారు.. తీరా చూస్తే అదే రొంపిలోకి దిగుతారు.
ఇదిగో.. ఇప్పుడు ‘భరత్ అనే నేను’ బ్యూటీ కూడా అందులోకి దూకింది. సీఎంకి లవర్‌గా వసుమతి పాత్రలో నటించిన కియారా అద్వానీ అంతకుముందే ‘ధోనీ’ బయోపిక్‌లో నటించి.. తన ట్యాలెంట్ ఏంటో నిరూపించుకుంది. ఇంత గొప్ప పేరు సాధించిన అమ్మాయికి బూతు చిత్రంలో నటించాల్సిన పనేంటి? ఈమె ఒక్కతే కాదులెండి.. ‘లస్ట్ స్టోరీస్’లో దాదాపు ప్రతిఒక్కళ్ళూ ప్రతిభ గలవాళ్ళే! ప్రేక్షకులతో, విమర్శకులతో శభాష్ అనిపించుకున్న వాళ్లే! అయినా.. వీళ్ళకేం ఖర్మ పట్టిందో.. అందరూ ఒక చోటుకి చేరి.. బూతు చిత్రంలో నటించారు.
ఈ జనరేషన్లో ‘బూతు’ ఎంత బ్రాండ్ అయితే మాత్రం.. తమ ట్యాలెంట్‌ని తామే తొక్కేసి మరీ ఇంతగా దిగజారాలా? ఏమైనా అంటే.. బూతు కూడా సినిమాలో భాగమే కదా? అందులో నటించాలంటే గట్స్ ఉండాలనే తొక్కలో మాటలొకటి! ఎవరో చేస్తే ఏదో అనుకోవచ్చు.. నలుగురికి ఐకాన్‌గా నిలిచే ప్రతిభగల తారలు కూడా ఇలాంటి పనులు చేస్తే.. కోపం రాక ఇంకేమొస్తుంది? వీళ్ళు ఇలా ఎంకరేజ్ చేయబట్టే.. యంగ్ జనరేషన్ కూడా చెడిపోతోంది. ఆల్రెడీ చెడిపోయిన ఈ ట్రెండ్‌ని మరింత దిగజారేలా చేస్తోంది.