భరత్ అనే నేను‌లో మీరు చూడని షాకింగ్ సీన్లు.. దిమ్మ తిరగడం ఖాయం

శ్రీమంతుడు తర్వాత కొరటాల శివ, ప్రిన్స్ మహేష్‌బాబు కాంబినేషన్‌లో వచ్చిన భరత్ అనే నేను భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ చిత్రంలో ప్రిన్స్ నటనకు, కొరటాల టేకింగ్‌పై ప్రశంసల వర్షం కురిసింది. భరత్ అనే నేను చిత్రం స్క్రిప్టు పరంగా నాలుగు గంటల వ్యవధి ఉన్నదని కొరటాల పలు సందర్భాల్లో వెల్లడించారు. నిడివిని తగ్గించేందుకు సుమారు 3 గంటలకు కుదించామని, అందుచేత కొన్ని సీన్లను తొలగించాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. సినిమా ఘన విజయం దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో నిర్మాత డీవీవీ దానయ్య యూట్యూబ్‌లో తొలగించిన సీన్లు పోస్టు చేశారు. భరత్ అనే నేను సినిమా రన్ టైమ్ ఎక్కువగా ఉన్న కారణంగా కొన్ని సన్నివేశాలు లేకుండానే విడుదల చెయ్యడం జరిగింది. ఈ అన్ కట్ సీన్లను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్‌లో ఉంచడం జరిగింది. ఈ సీన్లను మీరే చూడండి..

200 కోట్ల గ్రాస్ దిశగా
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం మొదటి వారాన్ని దిగ్విజయంగా పూర్తిచేసుకొని రెండో వారం మంచి వసూళ్ళు సాధించి మూడోవారం కూడా మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. ఓవర్ సీస్ లో సైతం మహేష్ తన సత్తా చూపిస్తున్నాడు. మహేష్ బాబు కెరీర్ లోనే ఈ సినిమా పెద్ద విజయంగా నిలిచింది. సీఎం భరత్ 200 కోట్ల గ్రాస్ దిశగా దూసుకెళ్తున్నాడు.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్‌లో
భరత్ అనే నేను సినిమా నిడివి ఎక్కువగా ఉన్న కారణంగా కొన్ని సీన్లను తొలగించారు. ఈ అన్ కట్ సీన్లను డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్‌లో పోస్ట్ చెయ్యడం జరిగింది. మూడు సీన్స్ బయటికి రావడం జరిగింది. అన్ని సన్నివేశాలు బాగున్నాయి. ఈ సీన్స్ సినిమాలో పెట్టి ఉంటె ఇంకా బాగుండేదేమో అనే ఆలోచన రావడం సహజం

స్కూళ్లు ఫీజుల పై భరత్ ప్రస్తుతం
ఎక్కడ చూసినా కార్పొరేట్ స్కూళ్లు ఫీజుల పేరిట లక్షలు లక్షలు దోచుకుంటున్నాయి కొన్ని విద్య సంస్థలు. ఈ విషయంపై భరత్ తనదైన శైలిలో స్పందించడం జరిగింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ కొడుకు చెంప చెల్లుమనిపించే సీన్ బాగుంది. ఈ సన్నివేశంలో సి.ఏం కేబినేట్ మీటింగ్ లో మాట్లాడిన మాటలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి.

మహేశ్ బాబు భరత్ అనే నేను సినిమాలో కరవు కోరల్లో దేవుడిపై భారం వేసి అరక పట్టిన ఒక రైతన్నతో మహేశ్ బాబు మాట్లాడే సీన్ సూపర్బ్ అనిపిస్తుంది. రైతు మహేష్ బాబుతో మాట్లాడే మాటలు వింటే ఒళ్ళు గగుర్పాటు కలుగుతోంది. ఈ సినిమాలో హోళీ ఫైట్ ఒకటి చిత్రీకరించడం జరిగింది. త్వరలో ఆ సీన్ ను యాడ్ చెయ్యబోతున్నట్లు సమాచారం

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *