దేవదాస్ మూవీ శాటిలైట్ రైట్స్ అంతా…!

devadas

అక్కినేని నాగార్జున, నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం దేవదాస్. వైజయంతి మూవీస్ బ్యానర్ లో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్ నిర్మిస్తున్నాడు. మణిశర్మ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఈ చిత్రంలో నాని, నాగార్జునల మధ్య జరిగే సీన్స్ చాల బాగున్నాయని సమాచారం. ఈ మధ్యనే రిలీజ్ అయినా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని మొదటి సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజగా ఈ చిత్ర శాటిలైట్ హక్కులకు సంబందించిన ఒక వార్త అందరాని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

నాగార్జున, నానికి ఉన్న ఇమేజ్ వలన ఈ చిత్రం యెక్క శాటిలైట్ హక్కులు రూపంలో 15 కోట్ల ఆఫర్ లభించినట్లు తెలుస్తోంది. దీనికి కారణం నాని, నాగార్జున కాంబినేషన్, మరియు అశ్వనిదత్ నిర్మాణంలో ఈ చిత్రం రావడమే. శాటిలైట్ హక్కులు రూపంలో 15 కోట్ల వస్తే ఇక సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వలన ఎంతవస్తుందో అని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ చిత్రం లో నాగార్జున సరసన ఆకాంక్ష సింగ్ హీరోయిన్ నటిస్తోంది. ఇక నాని సరసన గీత గోవిందం హీరోయిన్ రష్మిక మందన నటిస్తోంది. ఎంతో బారి అంచనాల మధ్య ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలాఖరున విడుదుల చేయడానికి సన్నాహకాలు చేస్తున్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *