
- గడ్డర్ల ఏర్పాటుకు సమాయత్తం.. భారీ క్రేన్లు రాక
- రూట్ ఆపరేషన్ రెడీ
- ఎస్వీఎస్ దగ్గర అప్రోచ్ పనులకు శ్రీకారం
- పిల్లర్ల ఏర్పాటుకు బ్యారికేడింగ్
బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ పనుల కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది ! వయాడక్ట్ నిర్మాణ పనులను నేడో, రేపో ప్రారంభించటానికి వీలుగా ఎన్‌హెచ్ సన్నద్ధమైంది! వయాడక్ట్‌ను నిర్మించటానికి పిల్లర్ల తలలపై గడ్డర్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభమయ్యాయి
బ్యాలెన్స్ పిల్లర్ల పనులకు ప్రణాళికలు
బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్‌కు సంబంధించి మొత్తం 49 పిల్లర్లను నిర్మించాల్సి ఉంది. అన్ని పిల్లర్లకు సంబంధించిన భూగర్భ పిల్లర్లను పూర్తి చేయటం జరిగింది. ఫౌండేషన్ వర్క్ కూడా పూర్తయింది. మొత్తం 30 పిల్లర్లు రూపుదిద్దుకున్నాయి. మిగిలిన 19 పిల్లర్లు వివిధ దశలలో ఉన్నాయి. జూలై నెలాఖరుకు పిల్లర్ల పనులనేవి లేకుండా చేపట్టాలని నిర్ణయించారు.
బెంజిసర్కిల్ ఫ్లై ఓవర్ అప్రోచ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఎస్వీఎస్ జంక్షన్ దగ్గర, రమేష్ హాస్పిటల్స్ దాటిన తర్వాత రెండు అప్రోచ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. రెండు చోట్ల అప్రోచ్లను వేయటానికి నేల చదును జరిగింది. అప్రోచ్ పనులను ముందుగా ఎస్వీఎస్ జంక్షన్ నుంచి ప్రారంభించారు.
బెంజిసర్కిల్ దగ్గర 9, 10 పిల్లర్లను ఏర్పాటు చేయటానికి ప్రత్యేకంగా బ్యారికేడింగ్ చేపట్టనున్నారు. బ్యారికేడింగ్ ఏర్పాటుకు ఎన్‌హెచ్, పోలీసు ఉన్నతాధికారులు జాయింట్‌గా పరిశీలించారు. రెండు రోజుల్లో బ్యారికేడింగ్ ఏర్పాటు చేసి పిల్లర్ల పనులు ప్రారంభిస్తారు.