బాలయ్య ,వినాయకల సినిమా ఆగిపోయే అవకాసం ఉంది కారణం ఇదే

బాల‌కృష్ణ దృష్టంతా ఇప్పుడు ఎన్టీఆర్ బ‌యోపిక్‌పైనే ఉంది. ఈసినిమాకి మ‌రింత క్రేజ్ తీసుకురావ‌డం ఎలా అనే విష‌యంలో ఆయ‌న త‌ర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్నారు. జులై మొద‌టి వారంలో చిత్రీక‌ర‌ణ ప్రారంభం కానుంది.

Image result for balayya vv vinayak

అయితే ఈలోగా వినాయ‌క్ సినిమామొద‌లు కావాల్సింది. సి.క‌ల్యాణ్ నిర్మాత‌గా వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాచేయ‌డానికి బాల‌కృష్ణ అంగీక‌రించారు. అన్నీ కుదిరితే బాల‌య్య పుట్టిన రోజున ఈ సినిమాకి కొబ్బ‌రికాయ కొడ‌దామ‌నుకున్నారు.
కానీ ఈ ప్రాజెక్టు విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక్క అడుగు కూడా ముందుకు ప‌డ‌లేదు. దానికి కార‌ణం..

Image result for balayya vv vinayak

క‌థ సెట్ అవ్వ‌క‌పోవ‌డమే. వినాయ‌క్ ఇప్ప‌టి వ‌ర‌కూ బాల‌య్య‌కు దాదాపుగా ప‌ది క‌థ‌లు వినిపించాడ‌ట‌. ఏ క‌థ కూడా బాల‌య్య అంచ‌నాల‌కు ద‌గ్గ‌ర‌గా రాలేద‌ని తెలుస్తోంది. దాంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయే ప్ర‌మాదంలో ప‌డింది. అయితే వినాయ‌క్ మాత్రం..

Image result for balayya vv vinayak

బాల‌య్యకు త‌గిన క‌థ త‌యారు చేయ‌డంలో త‌న శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తున్నాడ‌ట‌. త‌న ఆస్థాన క‌థ‌కుడు ఆకుల శివ చెప్పిన క‌థ‌లే కాకుండా, బ‌య‌టి ర‌చ‌యిత‌ల క‌థ‌ల‌నీ వింటున్నాడ‌ట‌. అయితే… అవేం అంత‌గా సంతృప్తి ప‌ర‌చ‌డం లేద‌ని స‌మాచారం. మ‌రి వినాయ‌క్ క‌థ‌ల వేట ఎప్ప‌టికి పూర్త‌వుతుందో చూడాలి.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *