Balayya Guest to Ntr Aravinda sametha movie

ఎన్టీఆర్ నటించిన ‘అరవింద’ సక్సెస్‌ మీట్‌కు ముఖ్యఅతిథిగా నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసింది. ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకకే బాలకృష్ణ హాజరవుతారని నందమూరి అభిమానులు ఆశించారు. కానీ అలా జరగలేదు. సినిమా విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. దీంతో అక్టోబర్ 21న (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికపై జరపనున్నామని శనివారం ప్రకటించారు. ఇదే వేదికను హీరో కల్యాణ్ రామ్ కూడా పంచుకోనున్నారు. నందమూరి బాలకృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్, నందమూరి తారక రామారావు అరవింద సమేత సాక్షిగా ఒకే వేదికపై నందమూరి అభిమానులకు కనువిందు చేయనున్నారు.

కాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘అరవింద సమేత’ చిత్రం సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అక్టోబర్ 11వ తేదీన విడుదలైన ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబడుతూ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. దీంతో చిత్రయూనిట్‌తో పాటు నందమూరి అభిమానుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఫ్యాన్స్, డిస్ట్రిబ్యూటర్ల సమక్షంలో ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్ నిర్వహించేందుకు సిద్ధమైంది చిత్రయూనిట్.

ఈ వేడుకను లైవ్‌లో కూడా ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు ఆయన సరసన నటించిన పూజా హెగ్డే, సీనియర్ నటుడు జగపతిబాబు‌లకు భారీ క్రేజ్ లభించింది. .

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *