ఎన్టీఆర్ చిన్న కొడుకు బారసాలకి.. బాలయ్య..

ఈమధ్యనే ఎన్.టి.ఆర్ మరోసారి తండ్రైన విషయం తెలిసిందే. తారక్ ఫ్యామిలీలోకి మరో కొత్త వ్యక్తిని ఆహ్వానించాడు. అతను వారసుడు కావడం విశేషం. రెండో కొడుకు పుట్టిన తర్వాత తారక్ మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నాడట. ఇక ఆ బుడతడి 21వ రోజు అంగరంగ వైభవంగా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట.

ఇక ఈ వేడుకకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నందమూరి నట సింహం బాలకృష్ణ నిలుస్తారని తెలుస్తుంది. బాలయ్యకు స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించాలని చూస్తున్నాడట తారక్. తారక్, బాలయ్య మధ్యలో కళ్యాణ్ రామ్ ఈ వ్యవహారం సెట్ చేస్తున్నాడట. ఒకవేళ అదే జరిగితే మళ్లీ నందమూరి ఫ్యామిలీ హీరోలంతా ఒకటైనట్టే అవుతుంది. ఎన్.టి.ఆర్ కొడుకు బారసాలకు బాలయ్య గెస్ట్ గా వస్తే ఇక ఫ్యాన్స్ కు వచ్చే ఆ కిక్ వేరేలా ఉంటుంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *