
వరుస కమిట్మంట్స్తో దూసుకుపోతున్న బాలకృష్ణ.. బోయపాటి దర్శకత్వంలోనూ ఓ సినిమాలో నటించాల్సి ఉంది. ఎప్పటినుంచో వినిపిస్తోన్న ఈ హ్యాట్రిక్ కాంబినేషన్.. ఈ ఏడాదే సెట్స్‌కు వెళ్లనుండటం హాట్ టాపిక్.
ప్రస్తుతం తన తండ్రి జీవితం ఆధారంగా రూపొందుతోన్న’ఎన్టీఆర్’ బయోపిక్ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు బాలకృష్ణ. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. బాలకృష్ణ కృష్ణుడి గెటప్‌లో ఉన్న లీక్డ్ ఫొటోస్ నెట్లో సందడి చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ నటించబోయే చిత్రం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఉంటుందట. ఎప్పటినుంచో బాలయ్య అభిమానులు ఎదురుచూస్తోన్న ఈ క్రేజీ కాంబినేషన్.. నవంబర్ నుంచే సెట్స్ పైకి వెళ్లబోతుండటం విశేషం.
బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాలు ఎంతటి ఘనవిజయం సాధించాయో తెలిసిందే. దీంతో ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిజానికి బాలయ్య 100వ చిత్రం బోయపాటితోనే ఉండాల్సింది. అనుకోని కారణాలతో ఈ కాంబినేషన్ ఆలస్యమవడంతో.. అప్పటినుంచి అభిమానులు ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ‘ఎన్టీఆర్’ బయోపిక్ తర్వాత వినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించాల్సి ఉంది. అయితే ఆల్రెడీ స్క్రిప్ట్ సిద్ధంగా ఉండడంతో బోయపాటి సినిమాకే సై అంటున్నాడట బాలయ్య. అక్టోబర్‌తో రామ్ చరణ్ హీరోగా తాను చేస్తోన్న సినిమాను పూర్తి చేయనున్నబోయపాటి.. నవంబర్ నుంచి బాలయ్య మూవీని సెట్స్‌కు తీసుకెళతాడట. వచ్చే ఏడాది సమ్మర్ రిలీజ్ టార్గెట్‌గా ఈ సినిమా వస్తుందట. ఇప్పటికే రెండు భారీ హిట్స్ అందుకున్న క్రేజీ కాంబినేషన్.. ఈ సినిమాతో హిట్ అందుకుంటే హ్యాట్రిక్ కొట్టినట్టే.! చూద్దాం ఏం జరుగుతుందో!