
మాస్ డైరెక్టర్ బోయపాటి శీను, నందమూరి హీరో బాలకృష్ణ కాంబినేషన్ అంటే అభిమానులలో ఏ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు భారీ విజయం సాధించడంతో ఈ కాంబోలో రాబోవు సినిమాపై అభిమానులలో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్‌కి సంబంధించిన పనులతో బిజీగా ఉండగా, బోయపాటి శ్రీను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నాడు.
ఈ ప్రాజెక్టుల తర్వాత మళ్ళీ బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందనుందని తెలుస్తుంది. ఇప్పటికే ఆ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ పూర్తి కావడంతో బాలయ్య బర్త్ డే ( జూన్ 10)రోజున ఈ సినిమా లాంచ్ కానుందని సమాచారం. ఆ రోజు చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ప్రకటించనున్నారు. ఈ సినిమాతో హ్యట్రిక్ కొట్టాలని బోయపాటి, బాలయ్య భావిస్తున్నారు ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్‌కి సంబంధించి భారీగా కసరత్తులు చేస్తున్న నేపథ్యంలో వచ్చే ఏడాది ఈ మూవీని సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ఈ లోపు బోయపాటి సినిమాని పూర్తి చేయాలని బాలయ్య భావిస్తున్నాడట.