
నందమూరి బాలకృష్ణ,.. తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ పెద్దల సమక్షంలో ఘనంగా ప్రారంభమైంది. అయితే ఈ చిత్రం తరువాత బాలయ్య .. వినాయక్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నారనేది తాజా సమాచారం. కన్నడలో ఘన విజయాన్ని సాధించిన ‘మఫ్టీ’ చిత్రంను, బాలకృష్ణతో రీమేక్ చేయడానికి నిర్మాత సి.కల్యాణ్ సన్నాహాలు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి.
‘జై సింహా’తో బాలకృష్ణకి విజయాన్ని అందించిన కె.ఎస్.రవికుమార్ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించనున్నట్టు చెప్పుకున్నారు. కానీ తాజాగా వినాయక్ ను కల్యాణ్ ఒప్పించాడనేది ఫిలింనగర్ సమాచారం. బాలకృష్ణ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్న ఈ చిత్రం, మే 27వ తేదీన సెట్స్ పైకి వెళ్లనుంది.