Balakrishna Speech in Aravinda Sametha Success Meet

ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్యంలో తెరకెక్కిన చిత్రం అరవింద సమేత వీర రాఘవ. దసరా కానుకగా అక్టోబర్ 11 న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధించడమే కాకుండా నాన్ బాహుబలి రికార్డులు అన్నిటిని చెరిపివేస్తు 150 కోట్లు సాధించి 200 కోట్లు వైపు పరిగెడుతుంది. ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ చిత్రం సక్సెస్ మీట్ ఈ రోజు శిల్ప కళావేదికలో జరగనుండగా, ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిధిగా బాబాయ్ బాలకృష్ణ వచ్చారు.

ఈ సక్సెస్ మీట్ లో సదరు యాంకర్ స్టేజి మీదకి ఆహ్వానించగా, నిర్మాత రాధాకృష్ణ పుష్పగుచ్ఛాన్ని అందించ్చారు. అనంతరం హీరో ఎన్టీఆర్ కి, దర్శకుడు త్రివిక్రమ్ కి షీల్డ్ లను బహుకరించారు. ఆ విజయోత్సవ సభ లో బాలకృష్ణ ముఖ్య అతిధి గా రావడమే కాదు, నందమూరి అభిమానుల రోమాలు నిక్కబొడుచుకొనేలా మాట్లాడి వారిని ఆనందపరిచాడు.ఎన్టీఆర్ ని “మా వాడు” అన్నట్లు మాట్లాడి వారి ఆనందాన్ని రెట్టింపు చేశాడు.

“నేను ,తారక్ చేసే సినిమాలు ఎవరి వల్లా కాదు . అవి జీవితాన్ని మించి ఉంటాయి. ఆడవారికి ఎంతో గౌరవాన్ని ఇస్తాము ” అంటూ… ఇంకా టీడీపీ ని ,హరి కృష్ణ గారి ని తలచుకుంటూ ., పూజ ని పొగుడుతూ ,అరవింద మూవీ యూనిట్ లో అందర్నీ అభినందిస్తూ ., కొన్ని సంస్కృత పద్యాలని వాడుతూ .. అబ్బో చాలా సందడి చేశారు.

దీనితో బాలయ్య ప్రేమ నైనా ,కోపాన్నైనా తట్టుకోవడం కష్టమే…! నా అనుకుంటే నెత్తిన పెట్టుకోవడం,కాదనుకుంటే ఆ మనిషే లేనట్లు ఉండడడం బాలయ్య కే చెల్లింది. అందుకేనేమో … మా బాలయ్య కొట్టినా మాకిష్టమే అని అతని అభిమానులు మురిసిపోతుంటారు.

Aravinda Sametha Movie Success Meet Chief Guest Nandamuri Balakrishna | Jr NTR | Nandamri Balakrishna | Pooja Hegde | Trivikram Srinivas

Jr. NTR, Pooja Hegde, Jagapathi Babu, Naga Babu, Sunil, Eesha Rebba

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *