
ఆ ఒక్క మాటతో ఎన్టీఆర్ స్థాయిని మార్చిన బాలయ్య..
Balakrishna sensational comments on tarak in aravinda sametha success meet
ఎన్టీఆర్, త్రివిక్రమ్ క్యాంబినేషన్ లో తెరకెక్కిన తాజా చిత్రం అరవింద సమేత వీర రాఘవ. అక్టోబర్ 11 న దసరా కానుకగా విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్ళని రాబడుతుంది. ఈ చిత్రం ఎన్టీఆర్ కేరీర్ లోనే భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. ఎంతటి ఘన విజయాన్ని సాధించిన ఈ చిత్రం సిక్స్ మీట్ నిన్న శిల్ప కళావేదికలో జరిగిన సంగతి తెలిసిందే.
Balakrishna Speech in Aravinda Sametha Success Meet
ఈ చిత్రం విజయోత్సవ వేడుకకు ముఖ్య అతిధిగా బాబాయ్ బాలకృష్ణ హాజరైన సంగతి తెలిసిందే. అసలు బాలయ్య బాబు ఈ వేడుకకు రావడానికి ఎన్టీఆర్ ఏమి చెప్పాడు? వారి మధ్య ఏమి జరిగింది అనే విషయంపై ఇటు అభిమానులలో అటు ప్రేక్షకులలో చాల అనుమానాలు ఉన్నాయి.
Nara Brahmani surprise gift to NTR
ఇవన్నీ ప్రక్కన పెడితే ఈ వేడుకలో బాబాయ్ బాలయ్య ఎన్టీఆర్ గురించి అన్న మాటలకి నందమూరి అభిమానులు ఫిదా అయ్యారు. అయన మాట్లాడుతూ మేం ఎంచుకునే కథలు లార్జర్ దేన్ లైప్ అన్నట్లుంటాయి. భూతద్దంపెట్టి చూస్తేనే ఆ లోతు తెలుస్తుంది అని అన్నారు. ‘నేను, మా తారక్ చేసే సినిమాలు చెయ్యడం ఎవరితరం కాదు. మేం చేసిన పాత్రలు మరెవరూ చేయలేరు,ఇతరులకు అవి అసాధ్యం అని చెప్పుకొచ్చారు బాలయ్య. ఆ ఒక్క మాటతో ఎన్టీఆర్ స్థాయిని అమాంతం పెంచేసాడు బాబాయ్ బాలయ్య.