Balakrishna And NTR Powerful Entry

Balakrishna And NTR Powerful Entry

ఎన్టీఆర్, త్రివిక్రమే దానికి కారణం: ఈశ్వరీ రావు

అరవింద సమేత వీర రాఘవ’ మహా అద్భుతంలో తానుండటం అనేది నిజంగా అదృష్టమన్నారు సీనియర్ నటి ఈశ్వరీ రావు. హైదరాబాద్‌లో జరిగిన చిత్ర సక్సెస్ మీట్‌లో పాల్గొన్న ఆమె.. చిత్రం విజయం సాధించడం పట్ల తన ఆనందాన్ని పంచుకున్నారు. స్త్రీల విలువను చెప్పే ఈ సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఒప్పుకోవడం గొప్ప విషయం అన్నారు. చక్కని మాటలు.. కథతో వెళ్లి ఎన్టీఆర్‌ను త్రివిక్రమ్ ఒప్పించారని చెప్పారు. తన నటనను ప్రశంసిస్తూ చాలా మంది ఫోన్స్ చేస్తున్నారని.. ఇంత మంచి చిత్రాన్ని అందించిన త్రివిక్రమ్, ఎన్టీఆరే దానికి కారణమన్నారు ఈశ్వరీరావు.

‘ఎన్టీఆర్’ లో బాలకృష్ణ పాత్రలో ఎన్టీఆర్..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ చిత్రం దసరా కానుకగా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం సక్సెస్ మీట్ ను నేడు భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ సక్సెస్ వేడుకలో ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ పాల్గొనబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ వేడుకపై ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ మరియు బాలకృష్ణ లు ఒకే వేదికపై కనిపించబోతున్నారు. గత కొంత కాలంగా ఈ ఇద్దరి మద్య విభేదాలంటూ వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. అయితే తాజాగా హరికృష్ణ మరణంతో బాలకృష్ణ మరియు ఎన్టీఆర్ ల మద్య విభేదాలు పక్కకు పెట్టేశారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *