నాకు పనిలేక వచ్చానా?: బాబు ఆగ్రహం

టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి గుంటూరు జిల్లా నేతలు గైర్హాజరు అవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు హాజరుకాలేదంటూ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులును చంద్రబాబు ప్రశ్నించారు. ‘మీ నేతలు అంత బిజీగా ఉన్నారా ?…

నాకు పనిలేక సమావేశానికి వచ్చానా?’ అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సమన్వయ కమిటీ సమావేశానికి రాని వాళ్ళకు పదవులు అవసరమా? అని బాబు అన్నారు. నేతలకు హోదా పార్టీ వల్లే వస్తుందని…పార్టీ అంటే లెక్కలేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఈ పరిస్థితిపై గట్టిగా వ్యవహరించాలంటూ జీవీ ఆంజనేయులుకు సీఎం చంద్రబాబు సూచించారు.

Image result for chandrababu

పార్టీలో ఒకరిద్దరిని వదులుకునేందుకు సిద్ధమే : సీఎం చంద్రబాబు
కలిసి పని చేయకపోతే ఎంతటి వారిపైన అయినా చర్యలు తప్పవు…. పత్రికలకు ఎక్కి తన్నుకు చావద్దు… ఒకరిద్దరిని వదలుకోడానికి సిద్ధమే…… ఎమ్మెల్సీ ఎన్నికల్లో కలిసి పని చేశారు. ఇప్పుడు మీకేమైందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు జిల్లా నేతలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరా వతిలో సోమవారం కడప పార్లమెంట్‌ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.

Image result for chandrababu

నాలుగున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశం వాడీ వేడిగా కొనసాగినట్లు సమాచారం. నేతల అభిప్రాయాలతో పాటు సీఎం నిర్వహించిన సర్వే నివేదికలు అన్నింటిని పరిగ ణలోకి తీసుకొని నేతలకు సుదీర్ఘంగా క్లాస్‌ పీకారు. నాలుగు న్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో ఘాటుగానే సీఎం మాట్లాడినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కడప ఉక్కు పరిశ్రమపై ఆందోళనతో పాటు, కడపలో ఓ భారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. 2019లో మనం గెలవాలి. ఇందుకు ప్రతి ఒక్కరు సమన్వయంతో పని చేయాల్సిందే నని ఆయన గట్టిగా హెచ్చరించారు. చివరిగా సోమిరెడ్డి ముఖ్య నేతలతో ప్రత్యేకంగా

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *