స్టార్ క్రికెటర్‌కు కుక్కకాటు.. మ్యాచ్‌కు దూరం..!

Australian Cricketer D’Arcy Short Bitten by His Dog
పెర్త్: మనిషికి శునకమే మంచి మిత్రుడు అని అంతా భావిస్తారు.. కానీ ఆస్ట్రేలియా క్రికెటర్ డీఆర్కీ షార్ట్ ఇప్పుడు ఆ మాట ఎత్తితేనే కస్సుమంటాడేమో! తాను పెంచుకున్న పెంపుడు కుక్క తననే కరవడంతో అతడు ఏకంగా మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది మరి. రాల్ఫీ అని ముద్దుగా పిలుచుకునే పెంపుడు శునకంతో ఆడుకుంటూ ఉండగా పొరపాటున అది అతడిని కరవడంతో ముంజేతికి కుట్లు పడ్డాయి. దీంతో ఈ ఆస్ట్రేలియా వన్డే క్రికెట్ స్టార్… న్యూసౌత్‌వేల్స్‌పై జరిగే జేఎల్‌టీ వన్డేకప్‌ తొలి మ్యాచ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

కాగా కొత్తగా వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టులోకి వచ్చిన డీఆర్కీ షార్ట్‌కు ఇది నిజంగా ఎదురుదెబ్బేనని.. అతడు త్వరగా కోలుకుని మళ్లీ జట్టులోకి రావాలని సైన్స్ స్పోర్ట్స్ మెడిసిన్ మేనేజర్ నిక్ జోన్స్ పేర్కొన్నాడు. సౌత్ ఆస్ట్రేలియాపై శనివారం జరిగే మ్యాచ్‌కి అతడు సిద్ధంగా ఉంటాడని ఆశిస్తున్నామన్నాడు. ‘‘రెండు వారాల క్రితం డీఆర్కీ తన పెంపుడు శునకంతో ఆడుకుంటూ ఉండగా దురదృష్ట వశాత్తూ గాయపడ్డాడు. కుక్కకాటు కారణంగా అతడి చేతిపై లోతైన గాయం అయ్యింది…’’ అని జోన్స్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. చేతిపై కొన్ని కుట్లు పడడంతో పాటు, చిన్నపాటి సర్జరీ చేయాల్సి వచ్చిందనీ… అయితే ప్రస్తుతం ప్రాక్టీస్‌లో ఉన్న అతడు త్వరలోనే జట్టులోకి వస్తాడని తెలిపాడు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *