Sr ఎన్టీఆర్ వల్ల తెగ ఇబ్బంది పడిన అశ్వినీదత్

ఇటీవల మహానటి సినిమాను నిర్మించిన వైజయంతీ మూవీస్ సంస్థ అధిపతి అశ్వినీదత్. ఎన్టీఆర్ అంటే ఏంటో అభిమానమున్న అశ్వినీదత్ కు ఎప్పటికైనా ఎన్టీఆర్ తో సినిమా నిర్మించాలని కోరిక. అనుభవం కోసం ‘ఓ సీత కథ’ అనే సినిమాను భాగస్వామ్యంలో నిర్మించారు. ఆ సినిమా విజయం సాధించడంతో ఎన్టీఆర్ వద్దకు వెళ్ళి తన కోరికను బయటపెట్టారు అశ్వినీదత్. సినిమాలు నిర్మించడం అంటే రిస్కుతో కూడుకున్న పని కాబట్టి లాభాల్లో ఉన్నప్పుడే ఇంటికి వెళ్ళిపో అని సలహా ఇచ్చారంట ఎన్టీఆర్. నేను మీతో సినిమా చేస్తేగానీ వెళ్ళను అని అశ్వినీదత్ పట్టుపట్టేసరికి ఎన్టీఆర్ కూడా ఒప్పుకున్నారు.


సినిమాకు డేట్స్‌ ఇస్తూ బ్యానర్‌ పేరేంటి అని అడిగారు ఎన్టీఆర్. ఇంకా ఏమనుకోలేదు. మీరే పెడితే బాగుంటుంది అన్నారు అశ్వినీదత్. కృష్ణుడి మెడలో వైజయంతి మాల ఉంటుంది. వైజయంతి మూవీస్‌ అని పెట్టుకో అని సూచించారు ఎన్టీఆర్. దాంతో ఏకంగా ఎన్టీఆర్ కృష్ణుడుగా శంఖం పూరిస్తున్న ఫోటోనే తన బ్యానర్‌ లోగోగా మార్చుకున్నారు అశ్వినీదత్.

Related image
అసలు విషయం ఏమిటంటే షూటింగ్ జరిగే సమయంలో అశ్వినీదత్ సెట్లోకి రాగానే ఎన్టీఆర్ లేచి నిలబడి ఆయన కూర్చున్న తర్వాతే తిరిగి కూర్చునే వారంట. దీంతో తెగ ఇబ్బంది పడిన అశ్వినీదత్ ఆ మాటే ఎన్టీఆర్ తో అన్నారంట. దానికి సమాధానమిస్తూ… ‘మీరు నిర్మాతలు. నిర్మాతను, దర్శకుడిని యూనిట్ లో అందరూ గౌరవించాలి’ అన్నారంట. దాంతో కళ్ళు చెమర్చాయంటారు అశ్వినీదత్. అప్పుడే పరిశ్రమలో అడుగుపెట్టిన నిర్మాతకు ఒక స్టార్ హీరో అంత గౌరవం ఇవ్వడం ఒక్క ఎన్టీఆర్ విషయంలోనే చెల్లింది.
ఎన్టీఆర్ తో మొదటిసారిగా 1975లో ఎదురులేని మనిషి చిత్రాన్ని నిర్మించిన అశ్వినీదత్, 1978లో యుగపురుషుడు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం జులై 14న విడుదలైంది. అది మొదలు ఎన్టీఆర్ ను ఆయన అభిమానులంతా యుగపురుషుడిగా కీర్తిస్తున్నారు.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *