
ఈ సంవత్సరం వచ్చే సినిమా లలో ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తి గా ఎదురుచూసే సినిమా ఎన్టీఆర్,త్రివ్రిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చే సినిమా అరవింద సమేత రాఘవ. ఈ సినిమా షూటింగ్ ఎప్రిల్ లోనే ప్రారంభం అయినప్పటికి ఈ సినిమా షెడ్యూళ్ళు లో మార్పు లేకుండా త్వరత్వరగా షూట్ చేస్తున్నారు. ఈ సినిమా లో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసినప్పటి నుంచి ఈ సినిమా పై ఆసక్తి ఇంకా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు.
ఈ సినిమా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాబోతోంది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే 35 శాతం పూర్తి అయింది. ఇక ఈ సినిమా ని అక్టోంబర్ 11 వ తేదీనా విడుదల చేయనున్నట్లు గా చిత్ర యూనిట్ నుంచి సమాచారం. తారక్ ఈ సినిమా లో తోలిసారి రాయలసీమ యాస లో మాట్లాడబోతున్నారు.
ఫన్నీ కామెంట్స్ రాయడం లో త్రివ్రిక్రమ్ ది అందవేసినా చేయి. ఇక ఈ సినిమా లో తారక్ మరోకసారి టెంపర్ తరువాత సిక్స్ ప్యాక్ లో కనిపించబోతున్నాడు. తారక్ చాలా కాలం నుంచి ఫ్యాక్షనిస్ట్ సినిమా లకి దూరంగా ఉంటూ వచ్చాడు.. కానీ అసలు తారక్ బాడీ లాంగ్వేజ్ కి రాయలసీమ ఫ్యాక్షన్ కధలు సెట్ అవుతాయి. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ ఖాతా లో మరోక హిట్ అందుకునేటట్లుగానే కనిపిస్తున్నాడు.
ఇక ఎన్టీఆర్ కి ఒక ప్రక్క రవితేజ మరో ప్రక్క శర్వానంద్ లతో పోటీ ఎర్పడనుంది. ఒక వేళ ఈ సినిమా హిట్ టాక్ అందుకుంటే ఆ సినిమా లు బాగున్నా సరే గడ్డుకాలమే ఎదురవుతుంది.