జై.. జనతా.. రాఘవా 100 కోట్లు.. ముచ్చటగా మూడు.. ఎన్టీఆర్ ప్ర‌భంజ‌నం..!!

వీర రాఘవుడి మొండి కత్తి దాటికి బాక్సాఫీస్ బద్దలైంది. తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం పాత స్టైల్.. విరిగిన మొండి కత్తికి అంటిన రక్తాన్ని తొడకు అద్ది పాత రికార్డులను షేక్ చేసేశాడు బాక్సాఫీస్ బాద్ షా ఎన్టీఆర్. తారక్, త్రివిక్రమ్ కాంబోలో అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తొలిరోజే టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది.

NTR First Telugu Hero To Hold These Records
Image result for janatagarage

తొలిరోజు రికార్డ్ కలెక్షన్స్‌తో నాన్ బాహుబలి రికార్డ్స్‌ను తుడిచిపెట్టేసింది. ఎన్టీఆర్ కెరియర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్‌తో పాటు 2018లో బెగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా రికార్డులకెక్కింది. విడుదలైన మూడో రోజులకే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి కలెక్షన్ల సునామీతో చరిత్ర సృష్టించాడు వీర రాఘవుడు.
Image result for janatagarage
ఈ చిత్రంతో మరోసారి బాక్సాఫీస్ బాద్ షా అన్న పేరును సార్ధకం చేసుకున్నారు యంగ్ టైగర్. అయితే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఎన్టీఆర్‌కి కొత్తేం కాదు. ఎన్టీఆర్ బొమ్మకు హిట్ టాక్ వచ్చిందంటే.. నిర్మాతలు రూ. 100 కోట్లను లెక్కపెట్టుకోవడం కామన్‌గా మారింది. వరుసగా మూడు సంవత్సరాలు మూడు బ్లాక్ బస్టర్ హిట్లు.. మూడొందల కోట్లు లెక్కలు ఎన్టీఆర్‌కు మాత్రమే సాధ్యమయ్యాయి.
aravinda sametha collections
Image result for jailavakusa

2016 సంవత్సరంలో కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం రెండో వారంలో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. అనంతరం 2017లో కేఎస్ రవీంద్ర (బాబి) దర్శకత్వంలో ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన ‘జై లవకుశ’ చిత్రం సెప్టెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదలై తొలి మూడు రోజుల్లో 75 కోట్లను వసూలు చేసి.. మొదటి వారంలో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ లెక్కన వరుసగా మూడేళ్లు మూడు బ్లాక్ బస్టర్ హిట్‌లలో వందకోట్ల క్లబ్‌లో చేరిన తొలి హీరోగా రికార్డులు సృష్టించాడు ఎన్టీఆర్.

Image result for aravinda sametha

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *