
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి రెండు రాష్ట్రాలలో స్ట్రాంగ్ జోన్ ఏది అంటే కచ్చితంగా సీడెడ్ ఏరియా అని చెప్పాలి మిగిలిన హీరోల కన్నా ఇక్కడ ఎన్టీఆర్ మూవీస్ టాక్ కి అతీతంగా అద్బుతమైన వసూళ్లు రాబడుతాయి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమా ఈ ఏరియాలో ఓపెనింగ్ రోజు నుండే సంచలన కలెక్షన్స్ తో అల్టిమేట్ రికార్డులను నమోదు చేస్తూ దూసుకు పోవడం మనం చూస్తూనే ఉన్నాం.
కాగా సినిమా మొదటి వారం కలెక్షన్స్ పరంగా ఇక్కడ ఆల్ టైం నాన్ బాహుబలి 2 రికార్డ్ ను నమోదు చేయగా రంగస్థలం మరియు బాహుబలి 1 సినిమాల రికార్డులను కేవలం 6 రోజులలోనే బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. రంగస్థలం మొదటి వారం ఇక్కడ 11.3 కోట్ల షేర్ ని అందుకోగా బాహుబలి పార్ట్ 1 12.1 కోట్ల షేర్ ని అందుకుంది.
ఇప్పుడు 6 రోజుల్లోనే అరవింద సమేత ఇక్కడ 12.45 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా 7 వ రోజు వసూళ్ళతో కలిపి 13 కోట్లకి క్లోజ్ గా వెళ్ళే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది నిజంగా ఆల్ టైం హిస్టారికల్ ఇండస్ట్రీ రికార్డ్ అని చెప్పొచ్చు.
అరవింద సమేత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి 6 వ రోజు తో పోల్చితే 5% వరకు మాత్రమే డ్రాప్స్ ని సొంతం చేసుకుంది.. ఇక సినిమా ఈవినింగ్ షోల కి వచ్చే సరికి తెలంగాణ లో బతుకమ్మ పండగ సందర్బంగా కొంత వరకు ఇబ్బంది పడి డ్రాప్స్ ని సొంతం చేసుకుంది చెప్పొచ్చు. కానీ నైట్ షోల పరంగా బుకింగ్స్ మాత్రం అద్బుతంగా కొనసాగుతున్నాయి… ఇక ఆంధ్రా మరియు సీడెడ్ ఏరియాలలో మాత్రం 6 వ రోజు తో ఈక్వల్ గా జోరు చూపొతుంది ఈ సినిమా. దాంతో రోజు మొత్తం మీద సినిమా మంచి హోల్డ్ ని ఓవరాల్ గా కంటిన్యూ చేసింది అని చెప్పొచ్చు. కానీ మొత్తంగా 200 కోట్ల పైగా వసూల్ చేసి సంచలనం స్రుష్టించింది ఆరవిందుడి దండయాత్ర