
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్యం రవాణా వ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చింది. వాహనాల రిజిస్ట్రేషన్ లో జిల్లాల కోడ్ లను వెత్తేసింది. దీనికి బదులుగా రాష్ట్రంతా ఓకే కోడ్ అమల్లోకి తీసుకొచ్చింది. డిసెంబర్ నుంచి ఏ జిల్లాలో వాహనం రిజిస్టర్ అయినా దానికి ఏపీ 39 కోడ్ నే కేటాయిస్తుంది. ఈ మేరకు మార్పులు చేస్తున్నటు రవాణాశాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై నవంబర్ 15 వరకు అభ్యంతరాలను సేకరించి 21 లోపు తుది నోటిఫికేషన్ విడుదల చేస్తామని, చివరివారంలో సాఫ్ట్ వెర్ అప్ డేట్ చేసి డిసెంబర్ నుంచి కొత్త సిరీస్ మొదలు పెడతామని ఆ శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం వివరించారు.
23 జిల్లాలో ఏపీ 01 నుంచి ఏపీ 38 వరకు (ఆదిలాబాద్ 01 , అనంతపురం 02 … చివరిగా పచ్చిమగోదావరి ఏపీ-38 ) RTA కోడ్ నంబర్లు ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ జిల్లాలన్నీ టిఎస్ రిజిస్ట్రేషన్ కు మారిపోయాయి. అయితే ఇక్కడున్న RTA కార్యాలయాల ఆధారంగా అనంతపురం 01 నుండి పచ్చిమ గోదావరికి చివరి నెంబర్ ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే రాష్ట్రమంతా ఒకే కోడ్ ఇవ్వాలని రవాణాశాఖ నిర్ణయించింది. దీని ప్రకారం ఇకపై జిల్లా ఏదైనా రిజిస్ట్రేషన్ నంబర్లు మాత్రం ఏపీ 39 నుంచే మొదలవుతాయి. తొలుత ఏపీ 39 – ఏ0001 నుంచి ఏపీ 39 – ఏ9999 వాడా సిరీస్ ముగుస్తుంది.
ఆ తరువాత ఏపీ39 -బి0001 నుంచి ఏపీ39 -బి9999 వరకు వెళుతుంది. ఇలా ఏపీ39 -జెడ్ 9999 వెళ్లిన తరువాత ఏపీ39 -ఏఏ 0001 నుంచి సిరీస్ మొదలు పెట్టి ఏజెడ్ వరకు కొనసాగిస్తారు. ఆ తర్వాత బిఏ నుంచి బిజెడ్ వరకు సిఏ నుంచి సిజెడ్ వరకు ఇలా కొనసాగించనున్నట్లు ఆ సఖ ఉన్నతాధి కారులు వివరించారు. ఇప్పటివరకు పి సిరీస్ ను ఇకపైన అలాగే కొనసాగిస్తారు. టి, యూ, వి, డబ్ల్యూ, ఎక్స్ , వై సిరీస్ లు రవాణా వాహనాలకు, జెడ్ సిరీస్ ను ఏపిఎస్ఆర్టీసీకి కేటాయిస్తారు. ఓ అక్షరం సున్నాలా ఉంటుంది కాబట్టి అది ఎప్పటికి కేటాయించే అవకాశం ఉండదని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుత సిరీస్ ముగిసిన తర్వాత కోడ్ ను ఏపీ39 నుంచి ఏపీ40 కి మారుస్తామని కమిషనర్ వివరించారు.