
చంద్రబాబు NDA కన్వెనీర్ గా ఉన్నప్పుడు వాజపాయ్, అద్వానీ గార్లే ఎదురెళ్లి ఆహ్వానం పలికేవారు… ఆ ప్రభుత్వాన్ని అయిదు సంవత్సరాలు నిలబెట్టింది బాబుగారే… ఏపీకి నిధుల వరద పారింది అప్పుడే!
అలాంటి వ్యక్తిని గిల్లి, గిచ్చి, కొజ్జాగాళ్లతో నీచమైన మాటలు అనిపించారు… అలాగే క్రొత్త రాష్ట్రానికి ఆర్ధిక సహాయం చెయ్యకపోగా, ఇవ్వాల్సినవి ఇవ్వకుండా కుళ్లబొడిచారు… నిధులు అడిగితె, దేశ రక్షణ నిధులు ఇవ్వాలా అని గేలిచేశారు… అడుగడుగునా అవమాన పరిచారు.
బాబుగారికి రెండుసార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా తీసుకోలేదు… ఇప్పుడు కూడా చెప్తున్నారు నాకు ప్రధాని పదవి మీద ఆశ లేదు, నాకు ఏపీ నే ముఖ్యం అని!
నిద్రపోయే పులిని లెగ్గొట్టారు.
ఇక కాచుకోండి.
ఇప్పటికే, ప్రక్క ముఖ్యమంత్రి నాలుగురోజుల నుండి కోమాలో ఉన్నాడు.
ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి!
రాహుల్ గాంధీ ఎప్పటికప్పుడు బాబుగారి సూచనలు, సలహాలు తీసుకుంటున్నాడు.
అసలు యుద్దానికి ఆరు నెలలు టైం ఉంది.
ఇప్పుడు పులి లేచింది. వేట ప్రారంభిస్తే, ఎట్లుంటదో చూడండి!
Article by : Satya Annavarapu