ఏపీలో డీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి గంటా- AP dsc notification 2018 will be released tomarrow

AP dsc notification 2018 will be released tomarrow

ఏపీలో నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ) షెడ్యూల్‌ను గురువారం మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు.ఈ రోజు విజయవాడలోని ఓ హోటల్‌లో ఉదయం 9 గంటలకు ఈ షెడ్యూల్‌ను విడుదల చేసారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ శుక్రవారం విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. అయితే ఎక్కువమందికి ప్రయోజనం కలిగేలా డీఎస్సీ ఉండాలని తెలిపారు.

అయితే ఈ ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను టెట్ కమ్ టీఆర్‌టీ పరీక్షతో చేపడుతున్నామని తెలిపారు. నవంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. అలాగే డీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థుల వయో పరిమితి రెండేళ్లకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల వయో పరిమితి 49 ఏళ్లకు, జనరల్‌ కేటగిరీలో 42 నుంచి 44 ఏళ్లకు పొడిగించారు.

మొత్తం 7325 పోస్టులకు భర్తీకి కాను శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని, ఇందులో పాఠశాల విద్యాశాఖకు 4341, మోడల్‌ స్కూల్స్‌కు 909, మున్సిపల్‌ స్కూళ్లకు 1100, గిరిజన సంక్షేమ పాఠశాలకు 800, ఏపీఆర్‌ఈఐ సొసైటీ పాఠశాలలకు 175 పోస్టులు ఉంటాయి. కాగా.. ఈ 7325 పోస్టుల్లో 3666 ఎస్జీటీ, 1625 స్కూల్‌ అసిస్టెంట్‌, 452 లాంగ్వేజ్‌ పండిట్‌, 441 పీఈటీ, 556 టీజీటీ, 429 పీజీటీ, 77 ప్రిన్సిపాల్‌, 79 డ్రాయింగ్‌, డాన్స్‌ పోస్టులు ఉన్నాయి.

డీఎస్సీ షెడ్యూల్ వివరాలు:
నవంబర్‌ 1 నుంచి 16 వరకు దరఖాస్తుల స్వీకరణ
నవంబర్‌ 19 నుంచి 24 వరకు పరీక్షా కేంద్రాల ఎంపిక
నవంబర్‌ 29 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు
నవంబర్‌ 17న ఆన్‌లైన్‌లో మాక్‌ టెస్టులు
డిసెంబర్‌ 6, 11, 12, 13న డీఎస్సీ పరీక్షలు
డిసెంబర్‌ 6, 11 తేదీల్లో స్కూల్‌ అసిస్టెంట్స్‌ రాత పరీక్ష (నాన్‌ లాంగ్వేజెస్‌)
డిసెంబర్‌ 12, 13 న పీజీ టీచర్స్‌ రాత పరీక్ష
డిసెంబర్‌ 14, 26న టీచర్స్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌, ప్రిన్సిపల్స్‌ రాతపరీక్ష
డిసెంబర్‌ 17న పీఈటీ, మ్యూజిక్‌, క్రాఫ్ట్‌ అండ్‌ ఆర్ట్స్‌ , డ్రాయింగ్‌ రాత పరీక్ష
డిసెంబర్‌ 27న లాంగ్వేజ్‌ పండిట్స్‌ రాతపరీక్ష
డిసెంబర్‌ 28 నుంచి 2019 జనవరి 2 వరకు సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ రాతపరీక్ష
నవంబర్‌ 1 నుంచి 15 వరకు ఫీజు చెల్లింపునకు అవకాశం

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *