
ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. పోలవరం నిర్మాణం, నిర్వాసితుల కోసం నిధులు విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే తమ ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1504 కోట్లు తక్షణమే విడుదల చేయాలన్నారు. పోలవరం నిర్మాణం, భూసేకరణ పరిహారం కోసం రూ.10వేల కోట్లు అవసరమన్నారు. నిధులు విడుదలలో జాప్యం లేదంటున్న బీజేపీ నేతల వైఖరిని చంద్రబాబు తప్పుబట్టారు.
రేపు అన్ని జిల్లాల్లో బైక్ ర్యాలీలు, ఎల్లుండి ధర్నాలు
రేపు అన్ని జిల్లాల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని, అలాగే ఎల్లుండి కొన్ని జిల్లాల్లో ధర్నాలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. కడప ఉక్కు దీక్షపై సీఎం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… అలాగే 28న ఢిల్లీలో ఎంపీలతో ధర్నాలు చేస్తామన్నారు.