ఎన్టీఆర్ బయోపిక్ లో ఏయన్నార్ పాత్రలో నాగచైతన్య కాకుండా ఎవరో తెలుసా ??

“మళ్ళీ రావా”తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిన సుమంత్ ప్రస్తుతం “ఇదం జగత్, సుబ్రమణ్యపురం” సినిమాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాల షూటింగ్స్ సైమల్టేన్నియస్ గా జరుగుతున్నాయి. ఇప్పుడు “ఎన్టీఆర్’ బయోపిక్ లోనూ సుమంత్ భాగస్వామి కావడంతో మనోడి స్టార్ డమ్ ఒక్కసారిగా పెరిగింది. చూస్తుంటే.. థర్డ్ ఇన్నింగ్స్ ను సుమంత్ చాలా సేఫ్ గేమ్ ఆడుతూ తన ఉనికిని కాపాడుకుంటాడనిపిస్తుంది.బాలయ్య ఎప్పుడైతే తన తండ్రి ఎన్టీఆర్ జీవితం ఆధారంగా ఓ సినిమా తీస్తున్నట్లు ప్రకటించారో.. అప్పట్నుంచి ఆ సినిమా గురించి రోజుకో సంచలనమైన విషయం తెలుస్తూనే ఉంది. నిన్నమొన్నటివరకూ ఈ చిత్రంలో మహేష్ బాబు, రాణాలు కీలకపాత్రలు పోషించనున్నారనే వార్తలు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. సినిమా టీం నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ లేకపోవడంతో ఆ వార్తలన్నీ ప్రస్తుతానికి గాసిప్పులుగానే మిగిలిపోయాయి. అయితే.. తాజా సమాచారం ప్రకారం “ఎన్టీఆర్” బయోపిక్ లో సుమంత్ నటించనున్నాడని తెలుస్తోంది. ఎన్టీఆర్ కి అత్యంత ఆప్తమిత్రుడ్డైన ఏయన్నార్ పాత్రను సుమంత్ పోషించనున్నాడని తెలుస్తోంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *