ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రానికి 10 అవార్డులు : మంత్రి లోకేశ్

భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రానికి మొదటి స్థానం దక్కింది. కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా ఉత్తమ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది. ఈ అవార్డులలో ఒక ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా 10 అవార్డులు కొల్లగొట్టింది. అయితే పశ్చిమ బెంగాల్ 7 అవార్డులు సాధించి రెండోవ స్థానంలో నిలిచింది. అయితే మొత్తం ఆంధ్రప్రదేశ్ కి 9 క్యాటగిరిల్లో ఈ అవార్డులను దక్కించుకుంది. ఏపీ ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ వివిధ క్యాటగిరిల్లో అవార్డులు సాదించేందుకు కృషి చేసిన అధికారులను, సిబ్బందిని అభినందించారు.

అనంతరం మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రానికి 10 అవార్డులు వచ్చాయని తెలిపారు. కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 10 అవార్డులు అందుకుందని, ఉపాధి హామీ పథకం అవార్డుల్లో దేశంలో మొదటి స్థానంలో ఉన్నామన్నారు. పేదలకు పని కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా రూ.10వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. ఈ అవార్డులు రాష్ట్రస్థాయి, జిల్లాస్థాయి, గ్రామస్థాయి లో ఈ విధంగా ఉన్నాయి. అయితే సెప్టెంబర్ 11 న ఢిల్లీ లోని విగ్యాన్ భవన్ లో ఈ అవార్డుల ప్రధాన కార్యక్రమం జరగనుంది.

రాష్ట్ర స్థాయి అవార్డులు…
పారదర్శకత మరియు జవాబుదారీతనంలో ఆంధ్రప్రదేశ్ కి మొదటి స్థానం
ఉపాదిహామీ అనుసంధానం, గ్రామాల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనలో ఆంధ్రప్రదేశ్ కి రెండోవ స్థానం
గుడ్ గవర్నెన్స్ అమలులో 4 స్థానం
ఎక్కువ పనులు పూర్తి చెయ్యడంలో 3వ స్థానం
బేర్ ఫుట్ టెక్నిషియన్స్ అమలులో 3వ స్థానం

జిల్లాస్థాయి అవార్డులు 2
ఉపాదిహామీ పనులు అమలులో ఉత్తమ ఫలితాలు సాధించిన జిల్లాలు 18 అందులో 2 ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలకు అవార్డులు

గ్రామ స్థాయి అవార్డులు
గ్రామ స్థాయిలో పథకం అమలులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు
డి రాంబాబు(కర్నూలు జిల్లా)
ఉపాదిహామీ పథకం అమలులో ఉత్తమ గ్రామం చిత్తూరు జిల్లా కోటబైలు గ్రామం

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *