
రాజధానికే తలమానికంగా ఎన్ఆర్టీ టవర్స్
అమరావతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలి..
జన్మభూమి రుణం తీర్చుకోవడం శుభ పరిణామం-చంద్రబాబు
ఎన్ఆర్టీ టవర్ల నిర్మాణ శంకుస్థాపన
సీఎంను సత్కరించిన రాయపూడి రైతులు
విదేశాల్లో నివాసం ఉంటున్న తెలుగువారు జన్మభూమి రుణం తీర్చుకోవాలని ముఖ్మమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాజధానిలోని రాయపూడి సమీపంలో ఎన్ఆర్టీ (నాన్ రెసిడెంట్ తెలుగు అసోసియేషన్) తలపెట్టిన 33 అంతస్థులతో రెండు టవర్ల నిర్మాణానికి శుక్రవారం సీఎం శంకుస్థాప చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ అమరావతి అభివృద్ధిలో భాగస్వాములవడానికి ఎన్ఆర్టీ సభ్యు లు ముందుకు రావటం అభినందనీయమన్నారు. రాజధానికి స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు రైతులు ఇవ్వ బట్టే మనం ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా మని.. వారికి ధన్యవాదాలు తెలిపారు.
గుంటూరు, తుళ్ళూరు: విదేశాల్లో నివాసం ఉంటున్న తెలుగువారు జన్మభూమి రుణం తీర్చుకోవాలని ముఖ్మమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. రాజధానిలోని రాయపూడి సమీపంలో ఎన్ఆర్టీ(నాన్‌రెసిడెంట్ తెలుగు అసోసియేషన్)తలపెట్టిన 33 అతంస్థులతో రెండు టవర్ల నిర్మాణానికి శుక్రవారం సీఎం శంకుస్థాప చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి అభివృద్ధిలో భాగస్వాములవడానికి ఎన్ఆర్టీ సభ్యులు ముందుకు రావటం అభినందనీయమన్నారు. రాజధానికి స్వచ్ఛందంగా 33 వేల ఎకరాలు రైతులు ఇవ్వబట్టే మనం ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. వారికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్ఆర్టీ టవర్స్ ది బెస్ట్ టవర్స్‌గా ఉంటాయన్నారు. వీటి గురించి ప్రపంచ దేశాలలో ప్రచారం జరగాలని సూచించారు.
కోలాహలంగా జరిగిన ఈ కార్యక్రమానికి రైతులు, ఎన్ఆర్టీ సభ్యులు, విద్యార్థులు హాజరయ్యారు. సీఎం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సీఎం వేదిక పైకి వస్తున్న సమయంలో సభికులు కేరింతలు కొట్టారు. ఉదయం 9.36 గంటలకు సీఎం కార్యక్రమానికి వచ్చారు. 11 గంటలకు ముఖ్యమంత్రి ప్రసంగం పూర్తి కావటంతో సభ ముగిసింది. రాయపూడికి చెందిన రైతులు సీఎం చంద్రబాబు ను గజమాలతో సత్కరించారు. సభకు వచ్చినవారికి అల్పాహారం, మంచినీటిని అందించారు. ఎన్ఆర్టీ సభ్యులు వివిధ దేశాల జెండాలతో సభలో ఆశీనులయ్యారు. కార్యక్రమంలో మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, కొల్లు రవీంద్ర, కలెక్టర్ కోన శశిధర్, ఎమ్మెల్యే లు తెనాలి శ్రావణ్‌కుమార్, జీవీ ఆంజనేయులు, జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్, మంగళగిరి మున్సిపల్ చైర్మన్‌్ గంజి చిరంజీవి, మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి, సీఆర్డీయే కమిషనర్ చెరుకూరి శ్రీధర్, ఎన్ఆర్టీ అధ్యక్షుడు రవి వేమూరి, విద్యార్థులు పాల్గొన్నారు.