క్రికెట్ అభిమానుల మనసు దోచుకున్న అంపైర్..వీడియో వైరల్

పాకిస్థాన్‌కు చెందిన అంపైర్ అలీందార్ ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభిమానుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. మ్యాచ్ మధ్యలో అకస్మాత్తుగా వర్షం రావడంతో ఆటగాళ్లతో పాటు మరో అంపైర్ మైదానాన్ని వీడినా..

Image result for sri lanka england aleem darతన బాధ్యతను మధ్యలో వదిలివెళ్లలేదు. అక్కడే వేచి ఉండి తను చేయాల్సిన పని పూర్తి చేసిన తర్వాతనే మైదానం నుంచి బయటికి వెళ్లి పలువురికి ఆదర్శంగా నిలిచారు. అసలేం జరిగిందంటే.. కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంక, ఇంగ్లాండ్ మధ్య ఇటీవల ఐదో వన్డే జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 366 పరుగులు చేసింది.

Image result for sri lanka england aleem dar

అనంతరం 367 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 26 ఓవర్లు పూర్తయ్యే సరికి 8 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

Image result for sri lanka england aleem dar

లంక స్పిన్నర్ అకిల ధనంజయ వేసిన 27వ ఓవర్‌లో లియామ్ ఫ్లంకెట్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ అలీందార్ ఔటిచ్చాడు. అవుట్ కాదన్న అనుమానంతో ఫ్లంకెట్ సమీక్ష కోరాడు. అదే సమయంలో వర్షం రావడంతో అందరూ డ్రెస్సింగ్ రూమ్‌లకు వెళ్లారు. ఒక్క అలీందార్ మాత్రం వర్షంలో తడుస్తూనే రివ్యూ కోసం ఎదురుచూశాడు.

సమీక్షలో ఫ్లంకెట్ ఔట్ అని తేలడంతో అప్పుడు అధికారికంగా మరోసారి ఔట్ ప్రకటించి అలీందార్ మైదానాన్ని వీడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
#Trending #brandedshehzad #Aleemdaar

Aleem Dar Chose To Wait in The Rain to Give the Final Decision For a Review

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *