అఖిల్ నాల్గొవ చిత్రం ఫిక్స్: క్యారక్టర్ ఇదే..

Akhil Akkineni 4th movie fix
అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మిస్టర్ మజ్ను. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా, ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేసుకుంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ చిత్రం షూటింగ్ దశలో ఉండగానే మరో యాక్షన్ థ్రిల్లర్ మూవీని అఖిల్ చేయనున్నట్టు తెలుస్తోంది.


ఆది పినిశెట్టి సోదరుడు ‘సత్య ప్రభాస్’ దర్శకత్యంలో అఖిల్ ఈ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది. ఆయన అఖిల్ కి కథ వినిపించడం .. అఖిల్ ఓకే చెప్పేయడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ సినిమాలో అఖిల్ గుర్రపు స్వారీ చేసే ‘జాకీ’గా కనిపించనున్నాడని చెబుతున్నారు. కథలోని కొత్తదనం కారణంగానే ఈ సినిమా చేయుటకు అఖిల్ ఒప్పుకున్నాడని అంటున్నారు. హీరోయిన్ ఫిక్స్ అవ్వగానే మిగిలిన విషయాలను తెలియచేస్తామని ఆయన అన్నారు.

Akhil Akkineni 4th movie fix director satya prabash

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *