ఆ సీన్ ఒక్కటి చాలు అంట ..

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడితో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా అనగానే అభిమానుల్లో ఇటు కామన్ఉ ఆడియన్స్ లో ఉమ్మడి కుటుంబం, అందులోని అనుబంధాలు.. మనసు కదిలించే మాటలు ఉంటాయని అనుకున్నారు. అవిఏమి కాకుండా మొన్న ఆగష్టు 15 న రిలీజ్ అయిన టీజర్ చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. రాయలసీమ నేపథ్యంలో సాగే కథకి ఎటువంటి యాక్షన్ అవసరమో, ఆ హీరోకి ఎటువంటి ఆవేశం ఉండాలో అవన్నీ అరవింద సమేత వీర రాఘవలో ఉన్నాయని అర్ధమయిపోయింది. తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటికి వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఎన్టీఆర్ షర్ట్ లెస్ గా.. సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించారు.. టీజర్ లోను ఆ లుక్ కనిపించింది. శత్రువులను తరుముకుంటూ కనిపించారు. ఆ సన్నివేశం సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని సమాచారం.
ఈ యాక్షన్ సీక్వెన్స్ మొత్తం 15 నిముషాలు ఉంటుందంట. అందులో ఎన్టీఆర్ యాక్షన్ కి ప్రతి ఒక్కరూ విజిల్స్ వేస్తారని చిత్ర బృందం వెల్లడించింది. ఎన్టీఆర్ నుంచి అభిమానులు ఏమైతే కోరుకుంటుంటారో అంతకు మించి ఈ ఫైట్ ఉంటుందని తెలిపింది. డీజీ బ్యూటీ పూజా హెగ్డే, హైదరాబాద్ బ్యూటీ ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. థమన్ పాటలను కంపోజ్ చేయడాన్ని కంప్లీట్ చేశారు. నేపథ్య సంగీతం సమకూర్చే పనిలో పడ్డారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 11 న రిలీజ్ కానుంది.

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *