పోలవరం_పూర్తి_సమాచారం

#పోలవరం_పూర్తి_సమాచారం

ప్రతి తెలుగు వారు తెలుసుకోవలసిన ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్.
ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయటానికి మన సీఎం చంద్రబాబు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారి కృషి అత్యద్భుతంగా ఉంది.
ఇంజనీరింగ్ అద్భుతం పోలవరం ప్రాజెక్ట్.
స్వతంత్ర భారత దేశం లో నిర్మితం అవుతున్న అతి గొప్ప ప్రాజెక్ట్ లలో పోలవరం ఒకటి , రాజకీయాలకి అతీతంగా ఈ ప్రాజెక్ట్ గురించి ప్రతి ఒక్కరు తెలుసు కోవాలి
పూర్వచరిత్ర
సర్ ఆర్డర్ కాటన్ , ధవళేశ్వరం ప్రాజెక్ట్ కట్టటానికి పూర్వమే పోలవరం కట్టటానికి ఆలోచన చేసారు , అయితే పోలవరం ప్రాజెక్ట్ ని రెండు కొండలు మధ్య నిర్మిస్తున్నారు , ఇక్కడ గోదావరి నది లోతుని అంచనా వెయ్యటానికి ఆ రోజులలో కాటన్ దగ్గర సాంకేతిక పరిజ్ఞానం లేదు , దాంతో కాటన్ పోలవరం వదిలేసి ధవళేశ్వరం వద్ద బ్యారేజి నిర్మించారు
ఏమిటి పోలవరం గొప్పతనం

Image result for polavaram
ఒక నది ని ఆ నదిలో కలిసే ఉపనదులు అన్నిటిని కలిపి నది వ్యవస్థ అంటారు , పాపి కొండలలో ప్రవేశించేసరికి గోదావరి నదికి అన్ని ఉపనదుల సంగమం పూర్తి అయి అఖండ గోదావరిగా రూపుదాలుస్తుంది , పోలవరం నుంచి రాజమండ్రి వచ్చి అక్కడ నుంచి గోదావరి ఏడుపాయలుగా సముద్రం లో సంగమం అయ్యేవరకు సుమారు 200 కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ ఉపనదులు గోదావరి లో కలవవు .
అఖండ గోదావరి మీద నిర్మించ బోయే అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది
ఎవరికి ఈ ప్రాజెక్ట్ ఉపయోగం
1 ఈ ప్రాజెక్ట్ వాళ్ళ గోదావరి జిల్లాలు లో 7 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించవచ్చు
2 కృష్ణ డెల్టా లో 8 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుతుంది
3 , గోదావరినుంచి కృష్ణ కి 80 టీఎంసీలు నీరు మళ్లించవచ్చు
4, తూర్పు గోదావరి ,విశాఖ జిల్లాలో మెట్టప్రాంతాలు కి సాగు నీరు అందించవచ్చు

Image result for polavaram

5 విశాఖ నగరం లో పారిశ్రామిక అవసరాలు , తాగునీరు కోసం 25 టి ఏం సీలు నీరు మళ్లించవచ్చు
6 . 960 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తారు
ఎప్పుడు ప్రారంభించారు
1 బ్రిటిష్ కాలం లో చర్చలు కి పరిమితం అయినా ఈ ప్రాజెక్ట్ కి 1980 లో అప్పటి ముఖ్యమంత్రి టి అంజయ్య గారు శంకుస్థాపన చేసారు , అప్పట్లో ఈ ప్రాజెక్ట్ కి పెట్టిన పేరు శ్రీ రామ పాద సాగర్ ప్రాజెక్ట్
2 తరవాత 2004 లో రాజశేకేర్ రెడ్డి ముఖ్య మంత్రి అయ్యాక శ్రీ రామ పాద సాగర్ ప్రాజెక్ట్ పేరును ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ గా మర్చి శంకుస్థాపన చేసారు

2004 నుంచి 2014 మధ్య ఏమి జరిగింది
2004 లో పిలిచినా టెండర్లు తో కుడి కాలవ 174 కిలోమీటర్లు తీయాల్సి ఉండగా 100 కిలోమీటర్లు తవ్వారు
ఎడమ కాలవ 151 కిలోమీటర్లు కి 60 కిలోమీటర్లు తవ్వారు ,ప్రధాన డాం దగ్గర 10 శాతం పనులు జరగలేదు
2004 లో పిలిచినా టెండర్లు రాజకీయ కారణాలు వాళ్ళ 2009 లో రద్దు చేసారు ,
2009 లో మల్లి కొత్త టెండర్లు పిలిచి 2013 కి ఫైనల్ చేసారు
మొత్తం మీద 2004 -2014 మధ్య ప్రధాన డ్యామ్ పనులు 10 శాతం పూర్తి అవ్వలేదు
ప్రాజెక్ట్ లో భాగం గ ఏ నిర్మాణాలు చేస్తున్నారు ??
1 డయాఫ్రామ్ వాల్
2 ఎర్త్ కం ర్యాక్ ఫీల్ డ్యామ్
3 స్పిల్ వే
4 కుడి , ఎడమ ప్రధాన కాల్వలు
5 . 960 మెగావాట్ల విద్యుత్ కేంద్రం నిర్మిస్తారు
6 ఎగువ కాపర్ డ్యామ్ , దిగువ కాపర్ డ్యామ్
7 జెట్ గ్రౌటింగ్
8 గేట్లు

Image result for polavaram
ప్రస్తుతం పరిస్థితి ఏమిటి ?
1 డయాఫ్రేమ్ వాల్ : దీని నిర్మాణం దాదాపు పూర్తి అయింది
2 ఎర్త్ కం ర్యాక్ ఫిల్ డ్యామ్ : దీనిని డయాఫ్రామ్ వాల్ మీద నిర్మిస్తారు , డయాఫ్రామ్ పూర్తి అయింది కాబట్టి ఈ పనులు ప్రారంభం అవుతున్నాయి
3 స్పిల్ వే : గోదావరికి కి 1986 లో వచ్చిన వరద 36 లక్షల క్యూసెక్స్ను , కానీ స్పిల్ వే ని 50 లక్షల క్యూసెక్స్ను వరద తట్టుకునే విధంగా నిర్మిస్తున్నారు , స్పిల్ వే 70 శాతం పూర్తి అయింది , దీనిమీద 48 గేట్లు అమర్చాల్సి వుంది
4 కుడి , ఎడమ కాల్వలు , కుడి కాలవ 91 శాతం పూర్తి అయింది , ఎడమ కాలవ 60 శాతం పూర్తి అయింది
5 విద్యుత్ కేంద్రం ప్రారంభ దశ లో వుంది
6 కేపర్ డ్యామ్ లో దిగువ కాపర్ డ్యామ్ పూర్తి అయింది , ఎగువ కాపర్ డ్యామ్ సగం పూర్తి అయింది
7 జెట్ గ్రౌటింగ్ దిగువ కాపర్ డ్యాంలో దాదాపు పూర్తి అయింది , ఎగువ కాపర్ డ్యామ్ లో మొదలు ఆవలి
ఖర్చు యెంత అవుతుంది
1 . 2005 -2006 అంచనాలు ప్రకారం 10000 కోట్లు
2 . 2010 -11 రేట్లు ప్రకారం అంచనాలు 16010 కోట్లు
3 2013 -14 అంచనాలు ప్రకారం 58319 కోట్లు
ఖర్చు ఎందుకు పెరిగింది
ఖర్చు పెరగటానికి ప్రధాన కారణం , 2013 లో చేసిన భూసేకరణ చట్టం మొత్తం 58319 కోట్లు లో 33000 కోట్లు భూసేకరణకే అవుతోంది , మిగిలిన ప్రాజెక్ట్ కి 25000 అవుతుంది

Image result for polavaram

కేంద్రం 2013 -14 అంచనాలు ఇంకా ఆమోదించలేదు , ప్రస్తుతం 16010 కోట్లు వరకు ఆమోదం లభించింది
ఇప్పటి వరకు యెంత ఖర్చు పెట్టారు
2014 కి ముందు 5000 కోట్లు ( సుమారు )
2014 తరవాత 8300 కోట్లు ఖర్చు పెట్టారు , కేంద్రం 5300 +1400 ఇచ్చింది ,ఇంకా 1600 కోట్లు కేంద్రం నుంచి రావాలి , మరియు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పెరిగిన అంచనా వ్యయానికి కేంద్రం అనుమతి ఇవ్వాల్సి వుంది

పోలవరం పూర్తి అయితే రాష్ట్రము సస్యశామలం అవుతుంది అనుటలో ఎటువంటి సందేహం లేదు , మొత్తం మీద ఇప్పటికి 58 శాతం పనులు పూర్తి అయినాయి .

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *