3 లక్షల ఇళ్లు!! ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే నిర్మింపబడి, లబ్ధిదారులు జులై 5 వ తేదీన గృహప్రవేశం..!

3 లక్షల ఇళ్లు!! ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంచే నిర్మింపబడి, లబ్ధిదారులు జులై 5 వ తేదీన గృహప్రవేశం..!

3 లక్షల కుటుంబాలు సొంత ఇంటిదారులు అయ్యే రోజు…!! 174 నియోజకవర్గాలు, 664 మండలాల్లోని 12, 767, పంచాయతీలు, 110మునిసిపాలిటీల్లోని 2093 వార్డుల పరిధిలో 3 లక్షల ఇళ్లు.

Image may contain: sky and outdoorతూర్పు గోదావరి – 37,207 ఇళ్లు
కర్నూలు -30,345
విశాఖ – 29,625
పశ్చిమ గోదావరి – 27,710
గుంటూరు – 24,767
చిత్తూరు – 20,888
అనంతపురం – 24,422
కృష్ణా – 20,109
ప్రకాశం – 19,655
నెల్లూరు – 19,047
విజయనగరం -16,645
శ్రీకాకుళం – 19,792
కడప -15,891

Image may contain: house, sky and outdoor

బహుశా , ఇన్ని ఇళ్లు ఒకే రోజు గృహప్రవేశం కావడం, అదీ, ప్రభుత్వ రంగంలో, ప్రభుత్వం చేత నిర్మింపబడి – ఇది ఒక గిన్నీస్ రికార్డ్ కావచ్చు.

Image may contain: outdoor

ఈ వేగం చూస్తే 2019కి, పెట్టుకొన్న “పది లక్షల ఇళ్లు”, మొదట్లో పెద్ద టార్గెట్ గా కనపడినా, ఇప్పుడు, లక్ష్యం కనుచూపు మేరలో కనిపిస్తున్నట్టు ఉంది.

Image may contain: sky and outdoor

మాటలు చెప్పడం, వాగ్ధానాలు చేయడం, రాజకీయంలో ఒక భాగం.
కానీ, ఇచ్చిన ఆ వాగ్ధానాలు సాధించి, లక్ష్యాన్ని చేరుకొని, భూమి మీద ఆ అవుట్ పుట్ చూపిస్తే, అది సుపరిపాలన అంటారు…!

Image may contain: outdoor

ఏ విధంగా చూసినా, గత గాంధీ జయంతికి ఆంధ్ర ప్రదేశ్ లో ఇచ్చిన లక్ష ఇళ్లు, రేపు ఇవ్వబోతున్న 3 లక్షల ఇళ్లు ….. వెరసి ” 4 లక్షలు ఇళ్లు – నాలుగు సంవత్సరాల్లో, అదీ రాజధాని కూడా లేని ఒక కొత్త రాష్ట్రంలో …..

దీన్ని… నేనైతే, సుపరిపాలన అంటాను…!

Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *